AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vayyari Bhama: మీకే చెప్పేది.. చలికాలంలో ఈ మొక్కకు చాలా దూరంగా ఉండండి.. మాములు డేంజర్ కాదు

‘వయ్యారిభామ’ .. పేరు అందంగా ఉంటుంది. మొక్క రూపం కూడా వయ్యారంగానే ఉంటుంది. కానీ దాని వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

Vayyari Bhama: మీకే చెప్పేది.. చలికాలంలో ఈ మొక్కకు చాలా దూరంగా ఉండండి.. మాములు డేంజర్ కాదు
Vayyari Bhama Plant
Ram Naramaneni
|

Updated on: Nov 25, 2022 | 2:55 PM

Share

వయ్యారి భామ చెట్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇవి తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. వయ్యారి భామ నీ హంస నడక అంటూ.. సినిమాల్లో హీరోయిన్స్‌ను పొగిడేందుకు ఈ మొక్క పేరును వినియోగిస్తారు. నిజ జీవితంలో మాత్రం ఇది చాలా సమస్యలు తీసుకువస్తుంది. ఇది కలుపు మొక్క. దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టెరోఫోరస్‌. ఇది పశువులతో పాటు మనుషులకు కూడా హాని కలిగిస్తుంది.  ముఖ్యంగా చలికాలంలో ఈ మొక్కకు చాలా దూరంగా ఉండాాలి. ఆ మొక్కలు ఉన్న ప్రాంతాల వైపు అసలు కన్నెత్తి కూడా చూడకండి.

ఈ మొక్క పుప్పొడిని పీల్చడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. శీతాకాలంలో, అలెర్జీ వ్యాధులను ఇవి ప్రేరేపిస్తాయి. వయ్యారి భామ నుండి విడుదలయ్యే పుప్పొడి దాదాపు 100 కి.మీ దూరం కూడా ప్రయాణిస్తుందట. దీని వలన ప్రజలు తరచుగా ఉబ్బసం లేదా తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురవుతుంటారు. జ్వరం, అతిసారం, చర్మం మంట, బ్రాంకైటిస్, క‌ను రెప్ప‌ల వాపులు, కళ్లు ఎర్ర‌గా మార‌డం వంటి సమస్యలను సైతం వస్తాయి. ఈ మొక్కలను తాకితే తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందుకే  ఒక దశాబ్దం క్రితం వరకు శీతాకాలం ప్రారంభానికి ముందు మున్సిపల్ కార్మికులు ఈ కలుపు మొక్కలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పీకి వేసి.. కాల్చి శుభ్రపరిచేవారు.

అందుకే శీతాకాలం ఉదయం 7 గంటల తర్వాత వాకింగ్ లేదా రన్నింగ్ ప్రారంభించడం మంచిది. సహజ సూర్యకాంతి పుష్కలంగా ఉన్నప్పుడు వయ్యారిభామ పుప్పొడి ప్రభావం తగ్గుతుంది. ఈ మొక్కలు మీ ప్రాంతంలో గనుక అధికంగా ఉంటే.. పూతకు రాకముందే ఉప్పు నీటిని పిచికారి చేయడం ద్వారా వాటి ఎదుగుదల అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ‌య్యారి భామ మొక్క‌ను పీకాలనుకున్నప్పుడు.. చేతుల‌కు బ్లౌజులు వేసుకోండి. లేదంటే అల‌ర్జీలు తప్పవు.

(Note: ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎటువంటి అనుమానాలున్నా సంబంధిత అధికారులు లేదా నిపుణులను సంప్రదించండి)