AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ చిట్కాలతో.. పోషకాహర లోపం సమస్యలకు ఈజీగా చెక్ పెట్టేయండి..

రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో B12 విటమిన్ సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది.. ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసి.. ఆహారం నుంచి విటమిన్ B12 ను విడుదల చేయడానికి కడుపులో తక్కువ ఆమ్లం ఉంటుంది. ఈసందర్భంలో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు..

Health Tips: ఈ చిట్కాలతో.. పోషకాహర లోపం సమస్యలకు ఈజీగా చెక్ పెట్టేయండి..
Nutration Food
Amarnadh Daneti
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 12, 2022 | 3:28 PM

Share

పోషకాహార లోపంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఫుడ్ తీసుకునే ముందు వాటిలో ఏ విటమిన్స్ ఉంటాయనే విషయం తెసుకుంటుంటారు. కొంతమంది అయితే ఫలానా విటమిన్ ఏ ఫుడ్ లో ఉంటే ఆ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో చాలామంది విటమిన్ల లోపంతో  బాధపడుతున్నారు. కొన్ని రకాల ఆహారాలను డైట్ లో తీసుకోవడం ద్వారా విటమిన్ల లోపాన్ని అధిగమించవచ్టుచు అంటున్నారు నిపుణులు. ఏ విటమిన్ల కోసం ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి పోషకాహారాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ విటమిన్లు అందరికీ సరైన మోతాదులో అందవు. అలాంటి వారు వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకుంటారు. కొన్ని విటమిన్ల కోసం ఆహారం కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈక్రింది ఆహారం తీసుకున్నా విటమిన్ లోపం ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

విటమిన్ B12 : రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో B12 విటమిన్ సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది.. ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసి.. ఆహారం నుంచి విటమిన్ B12 ను విడుదల చేయడానికి కడుపులో తక్కువ ఆమ్లం ఉంటుంది. ఈసందర్భంలో 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా విటమిన్ బి 12 తగినంత మొత్తంలో కంటే తక్కువగా ఉండే ప్రమాదం ఉన్నవారు.. సప్లిమెంట్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైద్యులను సంప్రదించాలి. మాంసం, గుడ్లు, పాలు, చీజ్ లేదా నాన్‌ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ పెరుగు వంటి పాల ఉత్పత్తులు, * బలవర్థకమైన సోయా పాలు వంటి వాటిలో విటమిన్ B12 ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో తక్కువ B12 కలిగి ఉండటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫోర్టిఫైడ్ ఫుడ్స్ B12కు మంచి వనరులని సూచిస్తున్నారు. చక్కెర పదార్థాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఫోలేట్, ఫోలిక్ యాసిడ్ : ఫోలేట్ అనేది విటమిన్ B9కు చెందిన అనేక రకాల రూపాలను వివరించడానికి ఉపయోగించే సాధారణ పదం. విటమిన్ B9 ఎనిమిది B విటమిన్లలో ఒకటి. ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలలో ఈవిటమిన్ కీలకం. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి.. గర్భిణులు మొదటి మూడు వారాలలో ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఫోలిక్ యాసిడ్ అనేది ఫోలేట్ సింథటిక్ రూపం. దీనిని సప్లిమెంట్లలో, బలవర్థకమైన ఆహారాలలో ఉపయోగిస్తారు. ఆకు పచ్చని కూరగాయలు, సిట్రస్ పండ్లు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలతో పాటు తక్కువ పంచదారతో చేసిన పండ్ల రసాలు, ఎండిన బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, చిక్కుళ్ళు మొదలైన వాటిలో విటబిన్ B9 ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ D: ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల కోసం అవసరమైన కాల్షియంను గ్రహించడానికి శరీరానికి తగినంత విటమిన్ D అవసరం. విటమిన్ డి లోపం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా.. విటమిన్ D ప్రధాన మూలం ఆహారం కాదు. సూర్యుడు.. దీనిని పొందాలంటే ఉదయపు ఎండలో ఎక్కువ సేపు ఉండాలి. నారింజ రసం, పాలు, తృణధాన్యాలతో సహా మరికొన్ని సహజ వనరుల ద్వారా విటమిన్ డి తీసుకోవచ్చు. అయితే పరిమితికి మించి ఎక్కువ సేపు ఎండలో నలబడటం కూడా మంచిద కాదు. దానివల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరం ఎంత వరకు సహకరిస్తే అంతవరకు ఎండలో ఉండాలి.

విటమిన్ B6: మానవ శరీరంలో దాదాపు 200 జీవరసాయన ప్రతిచర్యలలో విటమిన్ B6 భాగం. అయితే ఇది నిద్ర, ఆకలి, మానసిక స్థితిని నియంత్రిస్తుంది. రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో ఈవిటమిన్ సహాయపడుతుంది. వృద్ధులు చాలామంది విటమిన్ B6 లోపంతో బాధపడతారు. మాంసాలు, తృణధాన్యాలు, కూరగాయలు, గింజల్లో B6 అధికంగా ఉంటుంది. అలాగే ఉడికించిన బంగాళాదుంపలు, అరటిపండ్లు, చికెన్ వంటి వాటిలో బి6 విటమిన్ ఉంటుంది.

విటమిన్ A: దృష్టి, ఆరోగ్యకరమైన చర్మం, రోగనిరోధక శక్తి పెంచడంలో విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు వాటిలో ఈవిటమిన్ ఉంటుంది. క్యారెట్లు, చిలగడదుంపలు, పాలకూర, బ్రోకలీ, గుడ్లు, పాలు, వెన్న, చీజ్ వంటి పదార్థాల్లో విటమిన్ A ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..