Health: వేగంగా పెరుగుతున్న టీబీ బాధితులు.. కరోనా రెండో వేవ్ తర్వాత మరింత తీవ్రం.. మరెన్నో షాకింగ్ విషయాలు..

కరోనా మహమ్మారి రెండో వేవ్ సమయంలో ఊపిరితిత్తులలో మంట, కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల క్షయవ్యాధి..

Health: వేగంగా పెరుగుతున్న టీబీ బాధితులు.. కరోనా రెండో వేవ్ తర్వాత మరింత తీవ్రం.. మరెన్నో షాకింగ్ విషయాలు..
Follow us

|

Updated on: Oct 13, 2022 | 7:29 AM

కరోనా మహమ్మారి రెండో వేవ్ సమయంలో ఊపిరితిత్తులలో మంట, కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతే కాకుండా కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల క్షయవ్యాధి (టీబీ) ప్రమాదం పెరిగింది. ప్రపంచంలో ఉన్న టీబీ రోగుల్లో 27 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 35-50 కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా టీబీతో బాధపడుతున్నారని, ఏటా 26 లక్షల మందికి పైగా వ్యాధికి గురవుతున్నారని అంచనా. టీబీ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 5-7 శాతానికి పెరిగడం ఆందోళన కలిగిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ తేరెజా కసేవా మాట్లాడుతూ.. టీబీ ఉన్న పిల్లలు, యువకులలో కొవిడ్ -19 మహమ్మారి కారణంగా వ్యాధి నివారణ అవకాశాలు తగ్గాయని వెల్లడించింది. డాక్టర్ ఫర్హానా అమానుల్లా మాట్లాడుతూ.. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత అభివృద్ధి వేగం పిల్లలను వ్యాధి, మరణాల నుంచి రక్షించడానికి సహాయపడుతుందని, దీనికి చాలా సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

కొవిడ్-19 ను అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించినప్పటి నుంచి, డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ ప్రోగ్రామ్ మహమ్మారి ప్రభావాన్ని పర్యవేక్షించింది. జాతీయ క్షయ వ్యాధి కార్యక్రమం, మార్గదర్శకత్వానికి మద్దతు అందించింది. కరోనా రెండో వేవ్ సమయంలో వైరస్‌తో తీవ్రంగా పోరాడిన టీబీ రోగులను తాను చూసినట్లు ప్రొఫెసర్ ప్రసాద్ అన్నారు. ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి శరీరం రోగనిరోధక శక్తిని పునర్నిర్మించడానికి సమయం పడుతుంది. అయినప్పటికీ కొవిడ్ 19 రెండో వేవ్ సమయంలో తీవ్రమైన పరిస్థితులతో బాధపడుతున్న రోగుల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అంటు వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని పెంచింది. ప్రస్తుతం టీబీ కేసులు ఎక్కువగా ఉన్నందున ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.

కొంతమందిలో జలుబు, దగ్గు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా విజృంభించిన సమయంలో చాలా మంది టీబీ బాధితులు సరైన చికిత్స పొందలేకపోయారు. కాగా.. దేశంలో నిమిషానికి ఒకరు టీబీ కారణంగా మరణిస్తున్నారు. 2030 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లక్ష్యానికి ఐదేళ్ల ముందు టీబీని నిర్మూలించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత విధానం వల్ల టీబీకి ప్రైవేటు రంగాన్ని తోడుగా తీసుకెళ్తున్న తీరుకు ప్రభుత్వాన్ని అభినందించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

సరసమైన, నాణ్యమైన టీబీ పరీక్షలను ప్రోత్సహించడానికి, ప్రైవేట్ రంగం ద్వారా సరసమైన ధరలకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలి. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని కమ్యూనిటీ ఫార్మసీలతో క్రమపద్ధతిలో నిమగ్నమవ్వడానికి ఈ కార్యక్రమం ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Latest Articles