Benefits of Ashwagandha: మీలో ఆ సామర్థ్యం తగ్గిందా? అశ్వగంధతో ఇలా చేస్తే అద్భుత ప్రయోజనాలు..
ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే సామర్థ్యం కలిగి ఉందే. అందుకే ఆయుర్వేదంలో అశ్వగంధను

ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేసే సామర్థ్యం కలిగి ఉందే. అందుకే ఆయుర్వేదంలో అశ్వగంధను ముఖ్యమైన మూలికగా పేర్కొన్నారు. అశ్వగంధ.. పసుపు పువ్వులతో కూడిన చిన్న పొద అయిన అశ్వగంధ మొక్క నుండి లభిస్తుంది. ఈ మొక్క భారతదేశం, ఆగ్నేయాసియాలో లభిస్తుంది. మొక్క వేరు, ఆకుల సారం, పొడిని ఉపయోగిస్తారు. అశ్వగంధ అనే పేరు సంస్కృత పదం నుంచి వచ్చింది. అశ్వగంధను పొడి రూపంలో గానీ, ట్యాబ్లెట్స్ రూపంలో గానీ తీసుకోవచ్చు. అయితే, వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే.. వ్యక్తి శరీరాన్ని బట్టి ఎంత మొతాదు తీసుకోవాలనేది సూచిస్తారు.
అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలివే..
ఒత్తిడిని తగ్గిస్తుంది..
అశ్వగంధ ఒక అడాప్టోజెన్‌గా పరిగణించబడుతుంది. ఇది ఒత్తిడితో పోరాడటంలో సహాయపడుతుంది. ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది. డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారు అశ్వగంధ తీసుకోవడం వలన ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది..
అశ్వగంధ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అశ్వగంధ ఇన్సులిన్ స్రావంపై ప్రభావం చూపుతుంది. ఇది రక్తంలో గ్రూకోజ్‌ను గ్రహించడానికి సహాయపడుతుంది.




మంచి నిద్ర..
అశ్వగంధ మంచి నిద్రకు సహాయపడుతంది. నిద్రలేమితో బాధపడేవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడుతారు. కంటినిండా, ప్రశాంతంగా నిద్రపట్టేలా సహకరిస్తుంది. మానసిక చురుకుదనాన్ని ఇస్తుంది.
వాపు నివారణ..
వాపు సమస్యతో బాధపడుతున్నట్లయితే అశ్వగంధ మీకు అద్భుతంగా పని చేస్తుంది. శరీరంలో మంటలను తగ్గిస్తుంది.
శృంగార సామర్థ్యం..
శృంగార సామర్థ్యం తగ్గిన వారికి కూడా అశ్వగంధను రిఫర్ చేస్తారు ఆయుర్వేద నిపుణులు. ఇది టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచి, లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
గమనిక: సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనిని పబ్లిష్ చేయడం జరిగింది. అశ్వగంధను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. లేదంటే కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.




