Health: ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.. ఎలా గుర్తించాలంటే..

దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది అనేక రకాల క్యాన్సర్లతో మరణిస్తున్నారు. వీటిలో ఒకటి పేగు క్యాన్సర్...

Health: ఈ లక్షణాలు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు.. ఎలా గుర్తించాలంటే..
Cancer
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Jan 06, 2022 | 6:59 AM

దేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది అనేక రకాల క్యాన్సర్లతో మరణిస్తున్నారు. వీటిలో ఒకటి పేగు క్యాన్సర్. తరచుగా ప్రజలు కడుపులో సమస్యలను విస్మరిస్తారు. కానీ అనేక సందర్భాల్లో ఇది క్యాన్సర్‎కు కారణమవుతుంది. కడుపులోని శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాలు కడుపు క్యాన్సర్‌కు కారణమవుతాయని గ్యాస్ట్రోలజిస్ట్ డాక్టర్ అనిల్ అరోరా వివరించారు. ఈ స్థితిలో కడుపు కణాలు చాలా వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు చాలా ముందుగానే కనిపించడం ప్రారంభిస్తాయన్నారు. కానీ ప్రజలు వాటిని పట్టించుకోరని చెప్పారు.

పెద్దపేగు క్యాన్సర్ స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎక్కువ నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే లేదా ధూమపానం చేసినా, ఎక్కువగా మద్యం సేవిస్తే అది క్యాన్సర్‌కు దారి తీస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు పేగు క్యాన్సర్ ఉంటే, మీరు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించాలంటే ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి. మీ ఆహారంలో ఇనుము, కాల్షియం చేర్చాలి. రోజూ వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాలి.

ఇవి లక్షణాలు

  1. నిరంతర కడుపు నొప్పి
  2. ఆకలి లేకపోవడం
  3. రక్తస్రావం
  4. మలబద్ధకం సమస్య
  5. వికారం
  6. కొంచెం తిన్న తర్వాత కడుపు నిండుతుంది

Read Also..  ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడి..