AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Prevent Foods: క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పవర్ ఫుల్ ఫుడ్స్ ఇవే!

క్యాన్సర్.. ఈ పదం వినగానే భయం పుడుతంది. ఇదో పెను భూతంలా తయారవుతుంది. క్యాన్సర్ వచ్చిందంటే చికిత్స తీసుకోవడం అతి కష్టంగా మారుతుంది. ఇప్పుడంటే ఆధునిక వైద్యం వచ్చింది కానీ.. గతంలో అయితే ప్రాణాలు పోయేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి.. కట్టడి చేస్తే పెద్దగా ప్రమాదం ఉంది. కానీ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు కూడా చాలా మందికి తెలియదు. చేయి దాటకే క్యాన్సర్ ఉందన్న సంగతి..

Cancer Prevent Foods: క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పవర్ ఫుల్ ఫుడ్స్ ఇవే!
Cancer Prevent Foods
Chinni Enni
|

Updated on: Jan 24, 2024 | 5:08 PM

Share

క్యాన్సర్.. ఈ పదం వినగానే భయం పుడుతంది. ఇదో పెను భూతంలా తయారవుతుంది. క్యాన్సర్ వచ్చిందంటే చికిత్స తీసుకోవడం అతి కష్టంగా మారుతుంది. ఇప్పుడంటే ఆధునిక వైద్యం వచ్చింది కానీ.. గతంలో అయితే ప్రాణాలు పోయేవి. కానీ ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి.. కట్టడి చేస్తే పెద్దగా ప్రమాదం ఉంది. కానీ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు కూడా చాలా మందికి తెలియదు. చేయి దాటకే క్యాన్సర్ ఉందన్న సంగతి తెలుస్తోంది. అయితే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్‌ని కట్టడి చేయవచ్చు. పలు రకాల ఆహారాలు తినడం వల్ల కూడా క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రాక్ష పండ్లు:

ద్రాక్షలో‌ రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో క్యాన్సర్ కణితులు పెరకుండా చూస్తుంది. ద్రాక్ష పండ్లు ఎక్కువగా తినే వారిలో పొట్ట, రొమ్ము, కాలేయం క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తక్కుగా ఉంటుంది. కాబట్టి తరుచూ ద్రాక్ష తింటే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

బ్రోకలీ:

క్యాలీ ఫ్లవర్ జాతికి చెందిన వాటిల్లో బ్రోకలీ కూడా ఒకటి. చాలా మంది బ్రోకలీని సలాడ్స్ రూపంలో తినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీన్ని తరచూ తినడం వల్ల అన్న వాహిక క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్వర పేటిక క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలు బ్రోకలీలో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

టమాటాలు:

అందరికీ అందుబాటులో ఉండే వాటిల్లో టమాటాలు కూడా ఒకటి. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటాయి. ప్రతి రోజూ టమాటాలలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. టమాటా తింటే ప్రెసిడెంట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం తగ్గుతుంది.

బెర్రీ పండ్లు:

బెర్రీ జాతికి చెందిన పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా బెటర్. ఇప్పుడు బెర్రీస్ అన్ని చోట్లా విరివిగా లభ్యమవుతున్నాయి. వీటిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బెర్రీస్ తినడం వల్ల మూత్రాశయం, ఊపిరి తిత్తులు, రొమ్ము, అన్న వాహిక, చర్మ క్యాన్సర్ రాకుండా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడైనా బెర్రీస్ జాతి పండ్లు తింటే హెల్త్ కి చాలా మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.