Anemia: శరీరంలో రక్తం తక్కువగా ఉందని అనుమానం ఉందా.? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..
Anemia: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని రకాల క్రియలు సక్రమంగా సాగాలి. ఇందులో ప్రధానమైంది రక్తం. శరీరంలో సరిపడ రక్తం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా...

Anemia: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని రకాల క్రియలు సక్రమంగా సాగాలి. ఇందులో ప్రధానమైంది రక్తం. శరీరంలో సరిపడ రక్తం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా అందాలన్నా, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడంలో రక్తం ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తం సరిపడ ఉండక పోవడాన్ని రక్త హీనతగా పిలుస్తుంటారు. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే హిమగ్లోబిన్ ఉత్పత్తికి కావాల్సిన ఐరన్ లోపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మనలో చాలా మంది శరీరంలో సరిపడ రక్తం ఉందా.? లేదా.? అన్న అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయితే శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా రక్తం సరిపడా ఉందో లేదో కొన్ని లక్షణాలు ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే..
* రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం వంటి వాటిని తినాలనే కోరిక ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే రక్త హీనత ఉందనే నిర్ధారణకు రావొచ్చు.
* కొందరిలో శరీరం నిత్యం చల్లగా ఉంటుంది. అలాంటి వారిలో రక్త హీనత సమస్య ఉందని అనుమానించాలి.




* రక్త హీనత ఉన్న వారి చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి వారు కూడా వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిది.
* శరీరంలో సరిపడ రక్తం లేకపోతే చిన్న పనులకే అలసి పోతుంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంటుంది.
* రక్త హీనత ఉన్న వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం పెదవులు, చిగుళ్లు, కనురెప్పల లోపల ఎరుపు తగ్గడం. ఇలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి.
* కండరాల నొప్పులు, నిత్యం ఏదో తెలియని ఆందోళన ఉంటే రక్తహీనతగా భావించాలి.
* ఇక నిత్యం తలనొప్పితో బాధపడేవారిలో కూడా రక్త హీనత సమస్య ఉండే అవకాశాలు ఉంటాయి.
నోట్: పైన తెలిపిన లక్షణాలు రక్తహీనత వల్ల కలిగేవే అయితే కొన్ని సందర్భాల్లో ఇతర అనారోగ్య కారణాల వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకోకుండా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




