AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గుండె నిబ్బరంగా ఉండాలంటే.. ఈ ఆహారాన్ని తీసుకోండి..

ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ లో మార్పులు, ఆహార అలవాట్లలో మార్పులే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకస్మిక హృదయరుగ్మతలతో..

Health Tips: గుండె నిబ్బరంగా ఉండాలంటే.. ఈ ఆహారాన్ని తీసుకోండి..
Heart Health
Amarnadh Daneti
|

Updated on: Sep 07, 2022 | 8:14 PM

Share

Health Tips: ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ లో మార్పులు, ఆహార అలవాట్లలో మార్పులే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకస్మిక హృదయరుగ్మతలతో చాలా మంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో గుండెను పదిలంగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. పలు ఆహారాలను తీసుకోవడం వల్ల హృదయం నిబ్బరంగా ఉంటుందంటున్నారు. గుండె జబ్బులు, హృదయ రుగ్మతల సంఖ్య పెరుగుతున్నందున.. మన జీవనశైలిని మార్చుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను మన డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన గుండె కోసం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం.

బెర్రీస్: స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ మొదలైన ఈ వైబ్రంట్ కలర్ బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచివని సూచిస్తున్నారు. గుండె జబ్బులకు దారితీసే మంటను తగ్గించడంలో బెర్రీలు సహాయపడతాయి. వీటిని అనేక విధాలుగా తీసుకోవచ్చు. నేరుగా తినవచ్చు. అలాగే అల్పాహారంతో కలిపి తినవచ్చు.

వాల్‌నట్‌లు: వాల్‌నట్‌లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల పవర్‌హౌస్‌గా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది మనల్ని ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ కోసం వాల్నట్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆలివ్ ఆయిల్: నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివి కావు అంటారు. కానీ ఆలివ్ ఆయిల్ విషయంలో అలా కాదు. ప్రతి రోజు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తినే వారికి ఏ రకమైన కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని, కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 21% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉన్నట్లు తెలిసింది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చేపలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. చేపలు ఒమేగా -3కి గొప్ప మూలం. సాల్మన్, ట్యూనా, సార్డినెస్, మాకర్ ఎల్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3తో నిండి ఉంటాయి. అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చేప నూనెతో తయారు చేసిన అనేక క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి గుండె ఆరోగ్యానికి మంచి సప్లిమెంటరీ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..