AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price Crash: పాతాలానికి పడిన టమాటా ధరలు.. కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు!

కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు టమాటా రైతులు. ఎందుకంటే ప్రతి ఇంటిలో ప్రతి వంటలో వాడే టమాటా ధరలు మళ్ళీ పాతాలానికి చేరాయి. ఎళ్ల కాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్‌లో కనీస గిట్టుబాటు ధరే కాదు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఎక్కడపడితే అక్కడ టమోటాలను పారబోస్తున్నారు రైతులు.

Tomato Price Crash: పాతాలానికి పడిన టమాటా ధరలు.. కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్నలు!
Tomato Price Crash
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 11:55 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో మదనపల్లి తర్వాత అత్యధికంగా టమోటా పండించేది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఆస్పరి, మద్దికేర, డోన్ ప్యాపిలి, కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలలోని ఎక్కువగా టమోటా పంటలు పండిస్తారు. కూలి, ఎరువులు, విత్తనాలు, ఇతర సాగు ఖర్చులు పెరిగినందున కిలో టమోటాకి 20 రూపాయలు వస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో టామోటా ధరలు పాతాలానికి పడిపోయాయి. జిల్లాలో కిలో టమోటా ఐదు రూపాయలు ధర పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం టమోటా తెంచి మార్కెట్కు తీసుకొచ్చే రవాణా ఖర్చులు రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు్ననారు.

గిట్టుబాటు ధరతో పాటు రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండించిన పంటనను పొలాల్లోనే కొందరు రైతులు వదిలేస్తున్నారు. మరికొందరు రైతులు పంటను తీసుకొచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. ఇంకొందరు ధర లేక మార్కెట్లోనే పశువులకు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో కూడా అనేకసార్లు ఉత్పన్నమైంది. టమోటా తెచ్చేవారు లేక తెచ్చిన కొనేవారు లేక పోవడంతో పత్తికొండ టమోటా మార్కెట్ వారం రోజుల క్రితమే మూతపడింది. దీంతో రైతులు ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

ఇతర పంటలలాగే టమోటాకి కూడా తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ధర తగ్గినప్పుడు కనీసం కిలో 8 రూపాయల తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని గతంలో మంత్రి అచ్చం నాయుడు అధికారులను ఆదేశించారు. అయితే ఆదేశాలు ఇప్పుడు అమలు కావడం లేదు. దీంతో టమోటా రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని రైతులు వేడుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.