Capsicum benefits: క్యాప్సికమ్ పక్కకు పడేస్తున్నారా ? దాని ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..
సాధారణంగా మనకు కొన్ని కూరగాయలు అస్సలు నచ్చవు. ఒకవేళ ఆ వంటకం ఇంట్లో చేసిన అస్సలు పట్టుకోము. అలాంటి వాటిలో ఒకటి క్యాప్సికమ్.
సాధారణంగా మనకు కొన్ని కూరగాయలు అస్సలు నచ్చవు. ఒకవేళ ఆ వంటకం ఇంట్లో చేసిన అస్సలు పట్టుకోము. అలాంటి వాటిలో ఒకటి క్యాప్సికమ్. ఈ కూరగాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. దీనిని తినే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. క్యాప్సికమ్‌ను బెల్ పెప్పర్ అని కూడా పిలుస్తారు. క్యాప్సికమ్‌ను ఎక్కువగా సలాడ్లలో, ఫాస్ట్ ఫుడ్, ఇతర వంటలతో జతచేస్తుంటారు. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే అనేక వ్యాధులను నియంత్రించడంలోనూ క్యాప్సికమ్ సహాయపడుతుంది.
ప్రయోజనాలు.. 1. క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఎసోఫాగియల్ క్యాన్సర్, ప్రోస్టేట్, మూత్రాశయం, గర్భాశయ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 2. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కణాలను ఆక్సీకరణ ప్రమాదం నుంచి రక్షించడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 3. ఇందులో లైకోపీన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుందియ. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. రక్తపోటును నియంత్రిస్తుంది. 4. క్యాప్సికమ్ జ్యూస్ జీర్ణశయాందతర ప్రేగు వ్యాధులు అయిన డైస్పెప్పియా, డయేరియా, అల్సర్ సమస్యలను తగ్గిస్తుంది. 5. క్యాప్సికమ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. డైహైడ్రో టెస్టోస్టెరాన్ ప్రభావాల నుంచి జుట్టు కుదుళ్లను మెరుగుపరుస్తుంది. 6. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇది కళ్ల మాక్యులర్ క్షీణతను తగ్గిస్తుంది. అలాగే వయసు సంబంధిత సమస్యలను కూడా నియంత్రిస్తుంది. 7. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వృద్ధాప్య సంకేతాలను నియంత్రిస్తాయి.
Also Read: Weight Loss: రోజూ ఈ పానీయాలను తాగితే బరువు తగ్గడం సులభమే.. ప్రోటీన్ షేక్స్ ఎలా చేయాలంటే..