AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: రోజూ ఈ పానీయాలను తాగితే బరువు తగ్గడం సులభమే.. ప్రోటీన్ షేక్స్ ఎలా చేయాలంటే..

కరోనా సమయంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. జంక్ ఫుడ్.. ఆయిల్ ఫుడ్ వంటి అనారోగ్య సమస్యలను కలిగించే ఆహారాన్ని దూరం పెడుతూ..

Weight Loss: రోజూ ఈ పానీయాలను తాగితే బరువు తగ్గడం సులభమే.. ప్రోటీన్ షేక్స్ ఎలా చేయాలంటే..
Protein Shakes
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2021 | 8:52 AM

Share

కరోనా సమయంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. జంక్ ఫుడ్.. ఆయిల్ ఫుడ్ వంటి అనారోగ్య సమస్యలను కలిగించే ఆహారాన్ని దూరం పెడుతూ.. సహజ వనరులతో ఇంట్లో చేసిన ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మందికి బరువు పెరగడం ప్రధాన సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఇక బరువు తగ్గేందుకు వ్యాయమాలు చేయడం .. డైట్ పాటించడం చేస్తూ.. ఇతర అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు. అలాగే కాకుండా.. బరువు తగ్గేందుకు ప్రోటిన్ షేక్స్ ఎంతో సహాయపడతాయి. కండరాలను ఆరోగ్యంగా ఉంచడం దగ్గర్నుంచి.. జీవక్రియను పెంచడమే కాకుండా.. కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడతాయి. అయితే ఇంట్లో వీటిని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందామా.

* స్ట్రాబెర్రీ, చియా, బాదంపాలు… ఒక కప్పు స్ట్రాబ్రెరీ, కప్పు బాదం పాలు, 2 టీస్పూన్ల చియా విత్తనాలను తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. రోజూ ఉదయం బ్రేక్‏ఫాస్ట్, వ్యాయమం తర్వాత కానీ తాగాలి.

* చాక్లెట్, వేరుశనగ వెన్న, అరటి… ఒక అరటి పండు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ బటర్ .. 3 స్పూన్ల కరిగించిన డార్క్ చాక్లెట్ తీసుకుని మూడింటిన ఒక గాజు పాత్రలో కలిపి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కాసిన్ని పాలు కలిపి తీసుకోవాలి.

* గుడ్లు, పాలు, తేనె.. ఒక గుడ్డు, కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి పక్కన పెట్టుకోవాలి. రోజూ వ్యాయమం చేసిన తర్వాత ఈ షేక్ తీసుకోవాలి.

* పెరుగు, కివి, అవిసె గింజ.. ఒక కప్పు పెరుగు, కప్ కివి, 1 టీస్పూన్ గ్రౌండ్ అవిసెగింజలు, టీస్పూన్ తేనె కలిపి ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీనిని రోజూ తాగడం వలన బరువు తగ్గుతారు.

Also Read: Brown Rice Benefits : బ్రౌన్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..! చర్మం, జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం..

India Vs Srilanka: భారత్-శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. మొదటి వన్డే ఎప్పుడంటే.!

Jawan Jaswant Reddy: సొంతూరు చేరుకున్న వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డి డెడ్‌బాడీ.. కడసారి వీడ్కోలుకు తరలుతున్న అభిమానాలు