AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Vs Srilanka: భారత్-శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. మొదటి వన్డే ఎప్పుడంటే.!

ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా కారణంగా ఈ నెల 13 నుంచి మొదలు కావాల్సిన ఈ సిరీస్..

India Vs Srilanka: భారత్-శ్రీలంక సిరీస్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. మొదటి వన్డే ఎప్పుడంటే.!
India Vs Srilanka
Ravi Kiran
|

Updated on: Jul 10, 2021 | 10:36 AM

Share

ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా కారణంగా ఈ నెల 13 నుంచి మొదలు కావాల్సిన ఈ సిరీస్ నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూలై 17న మొదటి వన్డే జరగనుంది. 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరగనుంది. అలాగే జూలై 24న తొలి టీ20, 25న రెండో టీ20, 27న మూడో టీ20 నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ కూడా కొలంబో వేదికగా జరగనున్నాయి.

టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా జట్టులో అందరూ యువ ప్లేయర్లు ఉండటం విశేషం. ప్రతీ ఒక్కరికి కూడా ఆడటానికి ఛాన్స్ లభిస్తుందని గతంలోనే ద్రావిడ్ వెల్లడించిన విషయం తెలిసిందే.

కాగా, శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్, అనలిస్ట్‌లకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టు సభ్యులందరిని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే శ్రీలంక జట్టు మూడు రోజుల క్రితమే ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో లంక జట్టు ఘోర ఓటములను చవి చూసింది.

లంక టూర్‌కి భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), యుజ్వేందర్ చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా

Also Read:

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!