AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: శ్రీలంకతో జరిగే వన్డే, టీ 20 సిరీస్ వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన

IND vs SL : ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే- టి 20 సిరీస్‌పై కరోనా పంజా విసిరింది. జూలై 13 నుంచి వన్డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే

IND vs SL:  శ్రీలంకతో జరిగే వన్డే, టీ 20 సిరీస్ వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన
India Vs Sri Lanka
TV9 Telugu Digital Desk
| Edited By: uppula Raju|

Updated on: Jul 09, 2021 | 11:06 PM

Share

IND vs SL: ఇండియా, శ్రీలంక మధ్య జరిగే వన్డే- టి 20 సిరీస్‌పై కరోనా పంజా విసిరింది. జూలై 13 నుంచి వన్డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ సిరీస్ వాయిదా పడింది. శ్రీలంక క్రికెట్ జట్టు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో శ్రీలంక బోర్డు ఆటగాళ్లను మరికొంత కాలం క్వారంటైన్‌లో ఉంచనుంది. ఇప్పుడు ఈ షెడ్యూల్‌ని జూలై 17 లేదా 18 నుంచి నిర్వహించాలని భావిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్ నాయకత్వంలో భారత జట్టు 3 వన్డేలు, 3 టి 20 మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరగనున్నాయి.

తొలుత ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌కు గురువారం వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. దాంతో అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ క్రమంలోనే జట్టు సభ్యులందరికీ శుక్రవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా డేటా అనలిస్టు నిరోషన్‌కు కూడా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. దాంతో ఆటగాళ్లందరినీ ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు. కాగా, శ్రీలంక జట్టు మూడు రోజుల క్రితమే ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకొని తిరిగి స్వదేశానికి చేరిన సంగతి తెలిసిందే.

క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జూలై 10న సిరీస్‌లో కొత్త తేదీల గురించి శ్రీలంక క్రికెట్ బోర్డు భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలికి, దాని అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్‌కు తెలియజేస్తుంది. తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో వన్డే, టి 20 సిరీస్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. సిరీస్ చివరి వన్డే మ్యాచ్ తరువాత ఇంగ్లీష్ జట్టులో కరోనా కేసులు వెలువడ్డాయి. ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, సహాయక సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ కారణంగా మొత్తం జట్టు వేరుచేశారు. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం కొత్త జట్టును ఎంపిక చేశారు.

Corona Third Wave: మూడో దశ ముప్పుకు రెడీగా ఉండండి.. ఆక్సిజన్‌ నిల్వలు.. సరఫరాపై ప్రధాని మోడీ హై లెవల్‌ మీటింగ్‌

PM Kisan Scheme: దరఖాస్తుదారులందరికీ పిఎం కిసాన్ పథకం డబ్బు ఎందుకు రాలేదు? కారణం ఇదే..!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంటగలిసిన మానవత్వం… ఏ తల్లికీ రాకూడని కష్టం