PM Kisan Scheme: దరఖాస్తుదారులందరికీ పిఎం కిసాన్ పథకం డబ్బు ఎందుకు రాలేదు? కారణం ఇదే..!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద గత రెండు నెలల్లో 10,39,66,458 మంది రైతులకు రూ .2-2 వేలు అందజేశారు. ఈ పథకం ఎనిమిదవ విడత మే 14 న పీఎం నరేంద్ర మోడీ విడుదల చేశారు.

PM Kisan Scheme: దరఖాస్తుదారులందరికీ పిఎం కిసాన్ పథకం డబ్బు ఎందుకు రాలేదు? కారణం ఇదే..!
Pm Kisan Scheme
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 09, 2021 | 10:28 PM

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద గత రెండు నెలల్లో 10,39,66,458 మంది రైతులకు రూ .2-2 వేలు అందజేశారు. ఈ పథకం ఎనిమిదవ విడత మే 14 న పీఎం నరేంద్ర మోడీ విడుదల చేశారు. కానీ కొన్ని రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో డబ్బులు చేరుకోలుదు. వీటిలో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అస్సాం, మణిపూర్, సిక్కిం, జమ్ము కశ్మీర్, తమిళనాడు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎనిమిదవ విడత కోసం యాభై శాతం కంటే తక్కువ మంది ప్రజలు డబ్బు అందుకున్నారు.

ఈ పథకం కింద రూ .2 వేల చొప్పున మూడు విడతలుగా మొత్తం రూ .6000 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) అవుతుంటాయి. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల్లో.. ఎవరు రైతు, ఎవరు కాదని రాష్ట్రాలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అంటే, రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరణ లేకుండా కేంద్ర ప్రభుత్వం డబ్బును విడుదల చేయదు. కాబట్టి సరైన పత్రాలతో మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, వ్యవసాయ సమాచారాన్ని సరిగ్గా పూరించండి. లేకపోతే ధృవీకరణలో ట్యాంపరింగ్ ఉండవచ్చు.

ఏ రాష్ట్రంలో రైతులకు ఎంత శాతం డబ్బు వచ్చింది?

పశ్చిమ బెంగాల్‌లో ఈ పథకం కింద మొదటిసారిగా డబ్బు విడుదల చేయబడింది. కానీ ఈ డబ్బులు ఇప్పటికీ రైతులందరికీ చేరలేదు. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 64 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి పడింది. జార్ఖండ్‌లో 50 శాతం, అస్సాంలో 46 శాతం మందికి మాత్రమే ఎనిమిదవ విడత 2000 రూపాయలు జమ జరిగింది. కాగా, తమిళనాడులో 78, జమ్మూ కాశ్మీర్‌లో 75, మణిపూర్‌లో 48, మిజోరంలో 46, సిక్కింలో 59 శాతం మందికి మాత్రమే ఈ డబ్బులు డెబిట్ అయ్యాయి.

తక్కువ డబ్బు కొన్ని రాష్ట్రాలకు ఎందుకు చేరుకుంది?

ఈ పథకం అమలులో చాలా అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. ఇందులో చాలా మంది తప్పుడు ద‌ృవికరణ పత్రాలను పొందు పరిచినట్లుగా ఆ రాష్ట్రాల వ్యవసాయ అధికారులు అంటున్నారు. నమోదు చేసుకున్నవారిలో ఐదు శాతం లబ్ధిదారుల వివరాలు నిజంగా రైతులు కాదా తనిఖీలో తేలింది. అందువల్ల అంలాంటి రాష్ట్రాలకు డబ్బుల వేయడంలో ఆలస్యం జరుగుతోంది.

ఈ రాష్ట్రాల్లో పొరపాటు జరిగింది

గత ఏడాది తమిళనాడులో ఓ భారీ స్కాం వెలుగు చూసింది. కొందరు అధికారులు,ఉద్యోగులు కలిసి ఈ పథకం నుండి వచ్చిన కోటి రూపాయలను చట్టవిరుద్ధంగా విత్ డ్రా చేసుకున్నట్లుగా తేలింది. ఈ ఆరోపణపై, అక్కడ ఉన్న 96 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను రద్దు చేయగా, 34 మంది అధికారులపై డిపార్ట్‌మెంటల్ చర్య తీసుకున్నారు.

అస్సాంలో కూడా ఈ పథకం డబ్బుకు సంబంధించి భారీ గజిబిజి జరిగింది. ఇక్కడ 7 లక్షల మంది ప్రజలు ఈ పథకాన్ని తప్పుగా ఉపయోగించుకున్నారు. దీని దర్యాప్తు కొనసాగుతోంది. దీనితో రైతుల ధృవీకరణ జరగలేదు. ఇప్పటి వరకు 46 శాతం మంది దరఖాస్తుదారులకు మాత్రమే డబ్బు చేరాయి.

ఇవి కూడా చదవండి: Revanth Reddy: అంతా అక్కడి నుంచి వచ్చినవారే.. మంత్రి హరీష్ రావుకు పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్

Cabinet Meeting: ఈనెల 13న తెలంగాణ కేబినెట్ భేటీ.. కరోనా పరిస్థితి, వ్యవసాయంతోపాటు పలు అంశాలపై చర్చ