AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంటగలిసిన మానవత్వం… ఏ తల్లికీ రాకూడని కష్టం

కన్న కొడుకు చేత తల కొరివి పెట్టించుకునే తల్లిని చూసుంటాం. కానీ తల్లే తన కొడుక్కి తల కొరివి పెడితే.. అదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో.

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంటగలిసిన మానవత్వం... ఏ తల్లికీ రాకూడని కష్టం
Crime News
Venkata Narayana
|

Updated on: Jul 09, 2021 | 10:21 PM

Share

Tragedy: కన్న కొడుకు చేత తల కొరివి పెట్టించుకునే తల్లిని చూసుంటాం. కానీ తల్లే తన కొడుక్కి తల కొరివి పెడితే.. అదే జరిగింది మహబూబాబాద్ జిల్లాలో. జిల్లాలోని ఉప్పెరపల్లి గ్రామ ప్రజలను ఈ విషాద ఘటన కలచి వేసింది. గ్రామానికి చెందిన బుచ్చి రాములు అనే 65 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు. తండ్రికి తల కొరివి పెట్టమని కోరగా వారు నిరాకరించారు. దీంతో బుచ్చి రాములు తల్లి సత్తెమ్మ తన కొడిక్కి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు కంట తడి పెట్టుకున్నారు. ఏ తల్లికీ రాకూడని కష్టమని నిట్టూర్చారు.

విశాఖలో విషాదం..! ముద్దులొలికే రెండేళ్ల బాలుడితో తల్లి బలవన్మరణం..!

రెండ్రోజుల్లో ముద్దొలొలికే రెండేళ్ళ కొడుకు పుట్టినరోజు. ఆ మరుసటి రోజే తల్లి జన్మదినం..! ఇంతలో ఏమైందో ఏమో కానీ.. చిన్నారితో పాటు తల్లి ఆత్మహత్య చేసుకుంది. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థు పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలంలోనే తల్లి ప్రాణాలు కోల్పోగా.. కొన ఊపిరితో ఉన్న రెండేళ్ళ బాబును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. విశాఖ గాజువాక చుక్కవానిపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘటన వివరాల్లోకి వెళితే, విశాఖ నగరంలోని గాజువాక చుక్కవాని పాలెంలో సంతోష్‌ బెహరా తన భార్య జయంతి, రెండేళ్ళ కొడుకు రోనిత్‌ తో కలిసి నివాసముంటున్నాడు. సంతోష్‌.. గంగవరం పోర్టులో ఉద్యోగి. అయితే.. ఈనెల 11న కొడుకు రోనిత్‌కు, ఆ మరుసటి రోజు భార్య జయంతి పుట్టినరోజు. గతేడాది కొవిడ్‌ కారణంగా గారాలపట్టి రోనిత్‌ ఫస్ట్‌ బర్త్‌డేను జరుపుకోలేకపోయిన ఈ దంపతులు.. ఈ సారి రెండో బర్త్‌డే గ్రాండ్‌గా జరుపుకోవాలని అనుకున్నారు.

అయితే, ఇంతలో ఏమైందో ఏమో.. భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కలహాలతో మనస్తాపం చెందిన జయంతి.. కొడుకుతో కలిసి ఆత్మహత్యచేసుకోవాలనుకుంది. తాము నివశిస్తోన్న వ్రిష బద్రి అపార్ట్‌మెంట్‌ నాలుగో అంతస్థుపైకెక్కి కిందకు దూకింది. స్పాట్‌లోనే జయంతి మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న రెండేళ్ళ రోనిత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు అసలు కారణాన్ని అన్వేషిస్తున్నారు.

Read also: Transgender person: బాబు పుట్టిన వేళ కానుక ఇవ్వలేదని కిడ్నాప్ చేసి మరీ మూడు నెలల పనిగుడ్డుని చంపేసిన హిజ్రా