AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Juice: ఈ జ్యూసులు వారికి డేంజర్.. ఒంట్లో షుగర్ రాకెట్‌లా దూసుకెళ్తుంది..

మధుమేహం ఉన్నవారు తమ ఆహారం విషయంలో అస్సలు రాజీ పడకూడదు. పండ్ల రసం ఆరోగ్యకరమనే నమ్మకంతో చాలా మంది వాటిని విరివిగా తాగుతారు. కానీ, ఈ అలవాటే రక్తంలో చక్కెర స్థాయిలన్ ప్రమాదకరంగా పెంచుతుంది. మీరు రెగ్యులర్ గా తీసుకునే మూడు రకాల జ్యూస్ లు చక్కెరను రాకెట్ వేగంతో పెంచే శక్తి కలిగి ఉంటాయని మీకు తెలుసా? పోషకాలు, ఫైబర్ కు మధ్య తేడా తెలియక మనం చేస్తున్న ఈ పెద్ద తప్పు ఏమిటి? మధుమేహ రోగులు వెంటనే మానేయాల్సిన ఆ ప్రమాదకరమైన 3 జ్యూస్ లు ఏవో డాక్టర్ శిల్పా అరోరా మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.

Fruit Juice: ఈ జ్యూసులు వారికి డేంజర్.. ఒంట్లో షుగర్ రాకెట్‌లా దూసుకెళ్తుంది..
Juices 3 Drinks Diabetics Must Avoid
Bhavani
|

Updated on: Oct 02, 2025 | 7:47 PM

Share

ఈ రోజుల్లో ప్రతి మూడవ ఇంట డయాబెటిస్ రోగులు కనిపిస్తారు. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇలా జరుగుతుంది. డయాబెటిస్ కు శాశ్వత నివారణ లేదు. అందుకే తమ ఆహారంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. కానీ, ప్రతి రసం అందరికీ ప్రయోజనకరంగా ఉండదని గుర్తించాలి. చక్కెర స్థాయిలన్ రాకెట్ వేగంతో పెంచే మూడు ప్రమాదకర జ్యూస్ ల గురించి ఇప్పుడు చూద్దాం.

నారింజ రసం నారింజ రసం రక్తంలో చక్కెర స్థాయిలన్ పెంచుతుందని డాక్టర్ శిల్పా అరోరా వివరిస్తున్నారు. మధుమేహ రోగులు నారింజను పూర్తిగా తినాలి. ఎందుకంటే, గుజ్జులో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపుకు ప్రయోజనకరం. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. నారింజ రసంలో అధిక చక్కెర ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు హానికరం.

దానిమ్మ రసం దానిమ్మపండులో అనేక విటమిన్లు, పోషకాలు ఉంటాయనే మాట నిజం. అయితే, దానిమ్మ రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే భావన పూర్తిగా అవాస్తవం. దానిమ్మ తింటే, విత్తనాలతో సహా తినాలి. ఇలా చేయడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు సమస్యలు రాకుండా నివారించవచ్చు.

ఎర్ర ద్రాక్ష రసం ద్రాక్ష తినడానికి రుచికరంగా ఉంటుంది. ప్రజలు దాని రసాన ఇష్టపడతారు. ద్రాక్షలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ, దాని రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. పండ్ల రసం తాగే పేరుతో ప్రజలు ఫైబర్ మొత్తాన్ పారవేస్తారు. చక్కెరతో కూడిన రసం తాగుతారు. ఇది మేలు కంటే ఎక్కువ హాని చేస్తుంది.

గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం కేవలం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించబడింది. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే, మీ వైద్యుడిని లేదా అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించడం చాలా ముఖ్యం.