Self Pregnancy Test : ఇంట్లోనే ఆ పరీక్ష చేసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చాలా మంది మహిళలు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కొంత మంది మహిళలు అసురక్షిత సెక్స్ చేసినప్పుడు పీరియడ్స్ ఆగిపోతే భయపడుతూ ఉంటారు.

మాతృత్వాన్ని ప్రతి మహిళ అనుభూతి చెందాలనుకుంటుంది. అయితే పీరియడ్స్ మిస్ అయినప్పుడు చాలా ఆశతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అవ్వకపోతే చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి చాలా మంది మహిళలు ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కొంత మంది మహిళలు అసురక్షిత సెక్స్ చేసినప్పుడు పీరియడ్స్ ఆగిపోతే భయపడుతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఇంట్లోనే గర్భనిర్ధారణ పరీక్ష చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మీరు గర్భవతిగా ఉన్నారా? లేదా అని నిర్ధారించడానికి గర్భధారణ పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయితే మీరు ప్రెగ్నెంట్ అని, టెస్ట్ నెగెటివ్ అయితే మీరు ప్రెగ్నెంట్ కాదని అర్థం. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీరం చేసే హార్మోన్ అయిన హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (హెచ్‌సీజీ) గర్భ నిర్ధారణ అవుతుంది.
సమయమే కీలకం
మీరు గర్భవతి అయితే, మీ శరీరం మరింత హెచ్‌సీజీని ఉత్పత్తి చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ గర్భాశయంలో ఫలదీకరణం చేసిన గుడ్డు ఇంప్లాంట్ చేసిన తర్వాత మీ హెచ్‌సీజీ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి గర్భం దాల్చిన ఆరు నుండి 10 రోజుల తర్వాత గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. అంటే పీరియడ్స్ ఆగిపోయిన 6 నుంచి 10 రోజుల తర్వత గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం మంచిది. గర్భ నిర్ధారణ పరీక్షల్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి మూత్ర పరీక్ష అయితే రెండో రక్త పరీక్ష. ఇంట్లోనే నిర్వహించే గర్భనిర్ధారణ పరీక్షను మూత్రంతో ఇంట్లోనే నిర్వహించవచ్చు. గర్భం కోసం తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు మీరు రక్త పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కూడా గర్భ నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే చాలా మంది మహిళలు తక్కువ లేదా ఎక్కువ రుతుచక్రాలను కలిగి ఉంటారు. అందువల్ల తప్పుడు ప్రతికూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో, మీరు గర్భం దాల్చిన 10 రోజులలోపు ఇంట్లో పరీక్ష ద్వారా సానుకూల ఫలితాన్ని పొందవచ్చు. అలాగే చివరి అసురక్షిత సంభోగ సంఘటన తర్వాత కనీసం 21 రోజుల తర్వాత పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంత మందిలో గర్భం దాల్చిన 12 నుంచి 14 రోజుల తర్వాత గృహ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా హెచ్‌సీజీ ఎలివేటెడ్ లెవెల్స్‌ని గుర్తించవచ్చని అందువల్ల కచ్చితంగా పీరయడ్స్ మిస్ అయిన 10 రోజుల తర్వాతే పరీక్ష చేసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారు.
స్వీయ-గర్భధారణ పరీక్ష చేసుకోండిలా
- శుభ్రమైన కప్పులో మూత్రాన్ని పోయండి. మీ మూత్రంలో ఒకటి నుండి 3 చుక్కలను స్ట్రిప్‌పై ఉంచండి.
- ఫలితాన్ని చదవడానికి 10 నిమిషాలు వేచి ఉండండి
ప్రయోజనాలు, జాగ్రత్తలు
- స్వీయ గర్భనిర్ధారణ పరీక్ష కిట్లు చాలా చవకైనవి, ఉపయోగించడానికి కూడా సులభంగా ఉంటాయి.
- ఫలితాలు త్వరగా తెలుసుకోవచ్చు.
- పరీక్ష కిట్ గడువు ముగియలేదని నిర్ధారించుకోవాలి. అలాగే సరైన సమయంలో వాటిని ఉపయోగించడం ఉత్తమం.
- మీరు ప్రతికూల ఫలితాన్ని పొందినప్పటికీ, మీరు గర్భవతి అని అనుమానం ఉంటే కొన్ని రోజులు వేచి ఉండి మళ్లీ పరీక్ష చేసుకోవాలి.
- మీరు సానుకూల ఫలితాన్ని పొందకపోతే, గర్భధారణను నిర్ధారించడానికి, ప్రినేటల్ కేర్ ప్రారంభించడానికి వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి.
- ప్రశాంతంగా ఉండడంతో పాటు మీ గర్భం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.
- అయితే గర్భ నిర్ధారణ పరీక్షకు ముందు ఎక్కువ నీరు తాగకూడదని గుర్తుంచుకోవడం మంచిది.
నోట్.. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..





