Drinking Water: ఉదయం లేవగానే ఖాళీ కడుపు తో నీళ్ళు తాగితే .. బంగారం లాంటి ప్రయోజనాలు ! ఎంటో తెలుసా..

చర్మం ఆకృతిని నిర్వహించడానికి నీరు చాలా సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ముఖం హైడ్రేట్ అవుతుంది. ముడతలు, పొడి చర్మం తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది.

Jyothi Gadda

|

Updated on: Mar 31, 2023 | 3:36 PM

చాలామందికి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేవగానే  శరీరానికి  రీహైడ్రాషన్  కోసం నీరు  అవసరం. ఎందుకంటే, రాత్రి నిద్రపోతున్నప్పుడు , శరీరం ఆరు నుండి ఎనిమిది గంటలు నీరు లేకుండా ఉంటుంది. కాబట్టి మేల్కున్న తర్వాత  ఒక గ్లాస్ నీళ్లు తాగటం మంచిది. ఇది కాకుండా  ఉదయం నీరు తాగటం వలన ఇతర అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం .

1 / 7
ఖాళీ కడుపుతో నీళ్లు తాగటం జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే తాగునీటి వల్ల శరీరం నుండి విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది.

2 / 7
రక్తప్రవాహంలో ఉన్న వ్యర్ధాలను తొలగించి, మూత్ర రూపంలో బయటకు పంపటానికి మూత్రంపిండాలకు నీరు అవసరం. కాబట్టి ఉదయం మేల్కొగానే సరిపడ నీళ్లు తాగాలి. ఇలా తాగిన నీరు కడుపులో పేగులను శుభ్రపరుస్తుంది. జీర్ణవ్యవస్థను నియంత్రించి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది .

3 / 7
బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు నీళ్లు తాగటం ద్వారా కేలరీలు తగ్గించటానికి సహాయపడుతుంది. అల్పాహారం తినటానికి కనీసం30 నిమిషాల ముందు నీళ్లు తాగాలి. ఉదయం నిద్రలోంచి మేల్కొన్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తాగటం మానసిక పరిస్థితిని పెంచడానికి సహాయపడుతుంది.

4 / 7
Drinking Water

Drinking Water

5 / 7
ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల తలనొప్పి లేదా మైగ్రేన్ నుండి ఉపశమనం లభిస్తుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగటం శరీర అంతర్గత అవయవాల సరైన పనితీరుకు సహాయపడుతుంది.

6 / 7
పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. ఉదయానే నీరు తాగటం వల్ల మీకు వెంటనే శక్తి లభిస్తుంది.  ఎందుకంటే మీ శరీరం ఉదయం డీహైడ్రేట్ అయితే అలసటను కలిగిస్తుంది.

7 / 7
Follow us