- Telugu News Photo Gallery Sixth generation hyudai verna launched in india, check for full details here
Hyundai Verna: వారెవ్వా వెర్నా.. ఏముంది భయ్యా డిజైన్.. ఫీచర్లైతే మైండ్ బ్లాస్టింగ్ అంతే.. ఇప్పుడే బుక్ చేసుకోండి..
హ్యూందాయ్ కంపెనీ కార్లలో వెర్నాకు మన దేశంలో మంచి ప్రజాదరణ ఉంది. సెడాన్ వేరియంట్ కార్లలో వెర్నాకు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంది. దీంతో హ్యూందాయ్ కంపెనీ వినియోగదారుల అవసరాలను అంచనావేస్తూ ఐదు జనరేషన్ల వెర్నా మోడళ్లను అందించింది. ఇప్పుడు మరింత అప్ గ్రేడెడ్ వెర్షన్ ను ఆరో జనరేషన్ పేరిట దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన బుకింగ్ లు కూడా ప్రారంభించింది. ఏప్రిల్ మొదటి వారంలో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంది. హ్యూందాయ్ ఆరో జనరేషన్ వెర్నా ప్రారంభ ధర మన దేశంలో రూ. 10.90 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది.
Madhu |
Updated on: Mar 31, 2023 | 4:30 PM

డిజైన్ పరంగా.. కొత్త వెర్నా అవుట్‌గోయింగ్ మోడల్‌కు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. చాలా మంది దీని లుక్ చూసి స్టన్ అవుతారు. పాత వెర్నాకు దీనికి అసలు పోలికే ఉండదు. ఇది వెర్నాయేనా అన్నట్లు ఉంటుంది. పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. బానెట్ అంతటా రన్నింగ్ ఎల్ఈడీ స్ట్రిప్ ఉంది.

కొత్త వెర్నాలో వెనుక భాగంలో స్లోపింగ్ రూఫ్‌లైన్, బాడీ లైన్‌లపై బోల్డ్ కట్‌లు, క్రీజులు, డైమండ్-కట్ అల్లాయ్‌లు ఉన్నాయి. ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇది మొత్తం తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఫైరీ రెడ్, టైఫూన్ సిల్వర్, స్టార్రీ నైట్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టెల్లూరియన్ బ్రౌన్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్ డ్యూయల్ టోన్, ఫైరీ రెడ్ డ్యూయల్ టోన్ రంగులలో ఇది లభ్యమవుతోంది.

లోపలి భాగంలో, డ్యాష్‌బోర్డ్ రెండు స్క్రీన్ లను కలిగి ఉంది. ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కాగా, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం. వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుందాయ్ కొత్త వెర్నాలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు,ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కూడా పొందుతుంది.

కొత్త హ్యుందాయ్ వెర్నా రెండు పెట్రోల్ ఇంజన్‌లతో అందించబడుతుంది. 6-స్పీడ్ ఎంటీ, ఐవీటీతో జత చేయబడిన 113 bhp 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 158 bhp 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది, ఇది 6-స్పీడ్ ఎంటీ మరియు 7-స్పీడ్ డీసీతో జత చేయబడింది.

కొత్త 2023 హ్యుందాయ్ వెర్నా ధరలు రూ. 10.90 లక్షల నుండి రూ. 17.38 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉన్నాయి, . ఇది కొత్త హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా వంటి మోడళ్లకు మంచ పోటీ ఇవ్వగలుగుతుంది.





























