Heart Attack: మీ కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? దీని అర్థం.. గుండెపోటు వస్తున్నట్లే..
మనం అనుసరించే జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు లాంటి అనారోగ్యకరమైన ఆహారం.. అధిక ఒత్తిడి.. లాంటి కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. గుండెపోటు అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది..

మనం అనుసరించే జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు లాంటి అనారోగ్యకరమైన ఆహారం.. అధిక ఒత్తిడి.. లాంటి కారణాల వల్ల ఈ రోజుల్లో చాలా మంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. గుండెపోటు అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది.. చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ప్రధానంగా పేలవమైన జీవనశైలి.. అనారోగ్యకరమైన ఆహారం కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటు లక్షణాలు:
ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాల ద్వారా సాధారణంగా గుండెపోటును గుర్తిస్తారు.. అయితే గుండెపోటు వచ్చే ముందు, కొన్ని లక్షణాలు కాళ్లలో కూడా కనిపిస్తాయి. దీని గురించి తెలియకపోవడం వల్ల ప్రజలు ఇలాంటి లక్షణాలను విస్మరిస్తారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మన జీవితానికి ప్రమాదకరంగా, ప్రాణ సంకటంగా మారుతుంది.
కాళ్లలో కనిపించే గుండెపోటు సంకేతాలు:
పాదాల వాపు: కాళ్లు, చీలమండలు లేదా పిరుదులు ఆకస్మికంగా ఉబ్బడం గుండెపోటుకు సంకేతం కావచ్చు.. గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీర భాగాలకు రక్తం సరిగ్గా పంప్ చేయలేకపోతుంది.
కాళ్లలో భారం, కాళ్లలో నొప్పి: కొద్ది దూరం నడిచిన తర్వాత లేదా మెట్లు ఎక్కిన తర్వాత కాళ్లలో నొప్పి కనిపిస్తుంది. ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు.
కాళ్లలో తిమ్మిరి: కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి రక్త ప్రవాహం తగ్గినప్పుడు లేదా నరాలు దెబ్బతిన్నప్పుడు ఇది గుండెపోటుకు సంకేతం కావొచ్చు..
కాళ్ల చర్మం రంగులో మార్పు: కాళ్లపై చర్మం పసుపు, ఊదా లేదా నీలం రంగులోకి మారితే, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోవడానికి సంకేతం.
గుండెపోటు ఇతర లక్షణాలు:
- గుండెలో నొప్పి లేదా ఒత్తిడి
- శ్వాస ఆడకపోవడం
- ఆందోళన లేదా మైకము
- వాంతులు లేదా వికారం ఇబ్బంది
- అలసట.. నీరసం
- అధిక చెమట
వీటిపై శ్రద్ధ అవసరం:
గుండెపోటు లక్షణాలు అందరికీ ఒకేలా ఉండవు.
కొందరిలో తేలికపాటి లక్షణాలు ఉంటే.. మరికొందరిలో తీవ్రమైన లక్షణాలు ఉంటాయి.
గుండె జబ్బుల లక్షణాలు పురుషులు – స్త్రీలలో భిన్నంగా ఉంటాయి.
గుండెపోటు ప్రమాదాన్ని నివారించడానికి ఇలా చేయండి:
- ఆరోగ్యకరమైన ఆహారం తినండి
- రెగ్యులర్ వ్యాయామం అవసరం
- ధూమపానం – మద్యపానం మానుకోండి.
- ఒత్తిడిని నివారించండి
- ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం మంచిది
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




