AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Expiry Date: ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా..? చెడిపోయిందని తెలుసుకోవడం ఎలా..

ఉప్పు .. భూమిమీద ఉన్న జీవుల మనుగడకు కావలసిన ముఖ్య లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది. ఆహారంలో ఇది చాలా ప్రధానమైనది.

Salt Expiry Date: ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా..? చెడిపోయిందని తెలుసుకోవడం ఎలా..
Salt
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2024 | 1:16 PM

Share

ఉప్పు .. భూమిమీద ఉన్న జీవుల మనుగడకు కావలసిన ముఖ్య లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనము సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు మంచి రుచిని ఇస్తుంది. ఆహారంలో ఇది చాలా ప్రధానమైనది. దీనిని సముద్రపునీటిని ఇంకించి తయారు చేస్తారు. వాస్తవానికి వంట ఏమీ లేకుండా చేయవచ్చు.. కానీ ఉప్పు లేకుండా తయారు చేయడం అసాధ్యం.. ఉప్పు తప్పనిసరి. ఉప్పు వేయకుండా ఎన్ని మసాలాలు వేసినా రుచి రాదు.. దీంతోపాటు.. ఉప్పు శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.. ఎక్కువగా అస్సలు తీసుకోకూడదు..

అయితే.. ఉప్పుడు చెడిపోతుందా..? ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా..? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఎల్లప్పుడూ కలుగుతుంటాయి. అయితే.. ఉప్పు చెడిపోవడం గురించి చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఉప్పుకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఏం లేదు.. దీనికి గడువు అంటూ ఉండదు కానీ.. కొన్ని సందర్భాల్లో ఉప్పు కలుషితమైందని అర్థం చేసుకోవాలి..

ఉప్పు చెడిపోయిందో లేదో తెలుసుకోవడం ఎలా?

సాధారణంగా ఉప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.. కానీ ఎంతసేపు నిల్వ ఉంచినా అది ఎలా చెడిపోతుందనేది చాలా మందికి తెలియదు. దాన్ని ఎలా గుర్తించాలంటే.. ఆహార భద్రత పరంగా.. టేబుల్ ఉప్పు, తెరవని ప్యాకేజీలను నిరవధికంగా నిల్వ చేయవచ్చు. అయితే తెరిచిన ప్యాకేజీలను రెండు నుండి మూడు సంవత్సరాల తర్వాత పడేయడం బెటర్..

ఇంకా ఉప్పులో మచ్చలు కనిపించినా.. రంగు మారినా ఉప్పు కలుషితమైందని అర్థం. తాజా ఉప్పు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తెల్లగా ఉంటుంది. అలాగే ఉప్పులో ఎలాంటి వాసన ఉండకూడదు. ఉప్పు తడిగా ఉంటే అది తక్కువ గ్రేడ్ ఉప్పు.. ఉప్పు పొడిగా ఉంటే అది ముద్దలు లేకుండా ఉంటే అది స్వచ్ఛమైన ఉప్పుగా పరిగణిస్తారు.

వాస్తవానికి చెడిపోవడానికి, ఆహార విషానికి దారితీసే సూక్ష్మజీవులు పెరగడానికి నీరు అవసరం. కానీ స్వచ్ఛమైన ఉప్పులో నీరు ఉండదు, అంటే అది ఎప్పుడూ చెడ్డది కాదు. కానీ ఉప్పు గడువు ముగియకపోవడానికి మరొక కారణం ఉంది .. ఇది చాలా సూక్ష్మజీవులకు విషపూరితమైనది.

ఉప్పుకు గడువు ఉండదు అనేది ఇందుకోసమే.. అయితే.. స్వచ్ఛమైన ఉప్పు ఐదు సంవత్సరాల వరకు గరిష్ట స్థితిలో ఉంటుందని.. పేర్కొంటున్నారు. ఎందుకంటే.. సహజ లవణం.. సరస్సు, సముద్ర బాష్పీభవనం ద్వారా మిగిలిపోయిన ట్రేస్ ఖనిజాల నుంచి సేకరించిన ముతక రకం.. ఇది శాశ్వతంగా ఉంటుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్నీ పోషకాలు సమానంగా ఉండాలి. ఉప్పులో మంచి పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అతిగా తీసుకుంటే ప్రమాదం కూడానూ.. అందుకే.. కావాల్సినంత తీసుకోవడం చాలా ముఖ్యం..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..