Stevia Leaves: షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం.. పంచదార బదులు దీని ఆకులను వాడితే ఎంతో మేలంటున్న ఆయుర్వేదం

Stevia Plant-Ayurveda: ఎవరికైనా నువ్వు ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యానికి మంచిది వైద్యులు చెబుతారు. అప్పుడు వాటినే ఇంకా తినాలనే కోరిక..

Stevia Leaves: షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం.. పంచదార బదులు దీని ఆకులను వాడితే ఎంతో మేలంటున్న ఆయుర్వేదం
Stevia Leaves
Surya Kala

|

Nov 21, 2021 | 8:49 AM

Stevia Leaves-Ayurveda: ఎవరికైనా నువ్వు ఈ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యానికి మంచిది వైద్యులు చెబుతారు. అప్పుడు వాటినే ఇంకా తినాలనే కోరిక కలుగుతుంది. ఎందుకంటే మనిషి జిహ్వ చాపల్యం అలాంటిది మరి. ముఖ్యంగా షుగర్ వ్యాధి సమస్యతో బాధపడేవారు ఈ కోవలోకే వస్తారు. రోజు రోజుకీ ప్రపంచ వ్యాప్తంగా అధికంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఉన్నరని పలు అధ్యయనాలు చెబుతున్నారు. ప్రతి పదిమందిలో ఏడుగురు షుగర్ వ్యాధితో బాధపడుతూనే ఉన్నారు. దీనికి కారణం రక్తంలోని షుగర్ లెవెల్స్ లో ఏర్పడే హెచ్చుతగ్గులే. అందుకనే షుగర్ వ్యాధి సోకినవారు తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయితే మధుమేహులకు తీపి పదార్ధాలను తినాలని.. టీలో షుగర్ వేసుకుని తాగాలని కోరుకుంటారు. అటువంటి వారికోసమే.. పంచదార బదులు ఈ మొక్కల ఆకులను ఉపయోగించండి.. ఔషధ గుణాలున్న మొక్కల్లో ఒకటి స్టివియా. వివరాల్లోకి వెళ్తే..

మధుమేహ వ్యాధితో బాధపడే వారు మధుపత్రి (స్టీవియా) ఆకులను ప్రతి రోజు నమిలి తింటుంటే మధుమేహ వ్యాధి మటుమాయమవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీనిని ఇంగ్లీషులో స్టీవియా అని అంటారు. స్టివియా మొక్క ఆకుల్లో పంచదార కంటే ఎక్కువ తియ్యదనం ఉంది. ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్క మధుమేయాన్ని నియంత్రణలో ఉంచుతుంది.  స్టీవియా మొక్క ఆకులు చాలా తియ్యగా ఉంటాయి కనుక.. ఈ మొక్కను మధుపత్రి, తియ్యని మొక్కఅని కూడా పిలుస్తుంటారు.

స్టీవియా ఆకులను నోట్లో వేసుకుని చప్పరిస్తే పిప్పరమెంట్‌లా తియ్యగా ఉంటాయి. పంచదార కంటే 30 రెట్లు తియ్యదనాన్ని కల్గివుంటాయి. వీటినుంచి తీసిన చక్కెర మామూలు పంచదార కన్నా 300 రెట్లు తీపిగా ఉంటుంది. సాధారణంగా ఒక కప్పు పంచదార స్టీవియా ఆకుల నుంచి తీసిన పంచదార ఒక స్పూనుతో సమానం. కనుక మధుమేహ వ్యాధి ఉన్నవారు సహజమైన రుచికరమైన ఈ ఆకుల పొడిని వాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

*ఈ మధుపత్రి తులసి జాతికి చెందినది. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.

*రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహులకు ఈ ఆకులు అద్భుత వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి తియ్యదనం అందించటం తోపాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

*మధుప త్రి ఆకులతో రక్తపోటు, హైపర్‌ టెన్షన్‌, దంతాలు, గ్యాస్‌, కడుపులో మంట, గుండె జబ్బులు కలవారు, చర్మ వ్యాధులు కలవారు, ముఖంపై ముడతలు పడటం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

*మధుపత్రి ఆకులను తమలపాకుల్లా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే.. చాలు నోటి క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది.

*నోటి దుర్వాసన తో ఇబ్బంది పడుతుంటే.. మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా ఈ మొక్క ఆకులను ఉపయోగించ వచ్చు.

మధుపత్రి ఆకులను ఎండ బెట్టుకుని దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని కాఫీ, టీ, కషాయం ఏదైనా సరే అందులో ఒక స్పూన్ కలుపుకొని తాగవచ్చు. మామూలుగా పంచదార తింటే అనేక వ్యాధులు వస్తాయి. అయితే స్టీవియాతో తయారైన పంచదార తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకనే  మధుమేహ వ్యాధిగ్రస్తులు మధుపత్రిని నిర్భయంగా  తీసుకోవచ్చునని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Also Read:

వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌ నుంచే కోవిడ్ మొదటి కేసు.. మొదటగా కరోనా వచ్చింది.. ఈమెకే

జార్ఖండ్‌‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు.. భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాక్!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu