Tongue Colour: ముందుగా వైద్యులు నాలుకను ఎందుకు చూస్తారో తెలుసా..ఏ రంగు ఏ సమస్యని సూచిస్తుందంటే..

Tongue Colour: పంచేద్రియాలలో ఇది ఒకటి నాలుక. ఈ నాలుక శరీరంలో ఒక ముఖ్యభాగం .. దీనిని విశిష్టత ఎంతగా అంటే.. నరం లేని నాలుక, నోట్లో నాలుక లేనివాడు, వంటి నానుడి..

Tongue Colour: ముందుగా వైద్యులు నాలుకను ఎందుకు చూస్తారో తెలుసా..ఏ రంగు ఏ సమస్యని సూచిస్తుందంటే..
Tongue Colours
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2021 | 1:19 PM

Tongue Colour: పంచేద్రియాలలో ఇది ఒకటి నాలుక. ఈ నాలుక శరీరంలో ఒక ముఖ్యభాగం .. దీనిని విశిష్టత ఎంతగా అంటే.. నరం లేని నాలుక, నోట్లో నాలుక లేనివాడు, వంటి నానుడితో ఎదుటివారి వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెప్పేస్తారు. ఆహారాన్ని నమలడం, మింగదానికి రుచిని తెలియజేసే ఈ నాలిక మన శరీరం పని తీరుని కూడా తెలియజేస్తుంది. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళగానే ముందుగా ఆ డాక్టర్ ఒక్కసారి మీ నాలుక చూపించండి అని అంటారు. దీనికి కారణం.. నాలుక రంగుని బట్టి.. మన ఆరోగ్యం ఎలా ఉందో డాక్టర్లు తెలుసుకుంటారట. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలిక సన్నని తెల్లటి పూతతో గులాబీ రంగులో  ఉంటుంది.. అయితే మన నాలుక రంగు ఏ రంగులో ఉంటే ఏ అనారోగ్య సమస్యలు చిహ్నమో తెలుసుకుందాం.. !

*నాలుక పాలిపోయి తెల్లని గా ఉంటే మీ నోటి శుభ్రత తక్కువగా ఉందని అర్ధం. అంతేకాదు.. మీరు శరీరానికి తగిన నీరుని అందించడంలేదు.. మీ శరీరం డీహైడ్రేషన్ బారినపడింది అని సూచిస్తుంది.

*సీజనల్ వ్యాధి అయినా ఫ్లూ బారిన పడివారికి కూడా కొన్ని సార్లు నాలిక తెల్లగా మారుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉందని అర్థం. ఐరన్ ప్రోటీన్ల లోపానికి కూడా ఇది సంకేతం. కనుక నాలుక తెల్లగా ఉంటె వారు తినే ఆహారంలో పోషకాలు ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.

*బ్యాక్టీరియా పెరుగుదల వల్ల నాలుక పసుపు రంగులోకి  మారుతుంది. నోటి అపరిశుభ్రత,  పొడిబారిన నోరు ఇలా ప్రతి ఒక్కటి నాలుకపై బ్యాక్టీరియా పెరుగుదలకు కారణాలు. నాలుక పసుపు రంగులో ఉంటే .. అటువంటివారిలో జీర్ణ సంబంధ సమస్యలు, కాలేయ సమస్యల బారిన పడుతున్నారని ముందుగా సంకేతమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

*కెరాటిన్ పేరుకుపోవడం వల్ల నాలుక నల్లగా మారుతుంది. కెరాటిన్ అనేది చర్మం, జుట్టు , గోళ్లలో ఉండే ప్రోటీన్. అంతేకాదు.. ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకునేవారి నాలుక నలుపు రంగులోకి మారుతుంది.

*ఎక్కువగా పొగతాగేవారిలోను, కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకునేవారి నాలుక రంగు గోధుమ రంగులో ఉంటుంది.

*నాలుక ఎరుపు రంగంలోకి మారితే.. విటమిన్ బి లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం ఉందని గమనించాలి. వైరల్ ఇన్ఫెక్షన్ల తో జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.

*నాలుక ఊదా రంగులో ఉంటె మీకు రక్త ప్రసారంలో కానీ గుండె సంబంధ సమస్యలు కానీ ఉన్నట్లు గుర్తించాలి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఊదా రంగులోకి మారుతుంది.

*రక్తంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటె నాలుక నీలం రంగులో మారుతుంది. గుండె రక్తాన్ని సరిగ్గా శరీరానికి ప్రసరణ చేయలేని సమయంలో రక్తంలో ఆక్సిజన్ తగ్గడం మొదలైనప్పుడు నాలుక రంగు నీలం రంగులోకి మారుతుంది.

*నాలుక నారింజ రంగులోకి మారినట్లు అయితే నోటి పరిశుభ్రత సరిగా లేకపోవటం లేదా నోరు పొడిబారడం వంటి కారణాలు అని గుర్తించవచ్చు

Also Read:  అక్రమంగా పాము విషాన్ని అమ్ముతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్.. ఆ విషం ధర ఎంతో తెలిస్తే షాక్..