Patient Zero: వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌ నుంచే కోవిడ్ మొదటి కేసు.. మొదటగా కరోనా వచ్చింది.. ఈమెకే

Corona Virus: చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ పుట్టుక మీద రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది ఈ వైరస్ ల్యాబ్ లో..

Patient Zero: వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌ నుంచే కోవిడ్ మొదటి కేసు.. మొదటగా కరోనా వచ్చింది.. ఈమెకే
Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2021 | 8:04 AM

Corona Virus-Patient Zero: చైనాలో పుట్టి.. ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ పుట్టుక మీద రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది ఈ వైరస్ ల్యాబ్ లో తయారు చేశారని.. మరికొందరు వెట్ మార్కెట్స్ నుంచి వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది.. వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో ‘పేషెంట్ జీరో’  ద్వారా అని కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో కోవిడ్ పేషెంట్ జీరోకు సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన ఒక కథనం ప్రచురించారు. వివరాల్లోకి వెళ్తే..

వుహాన్ మార్కెట్‌లో జంతువులను విక్రయించే ఓ మహిళ కోవిడ్-19 లక్షణాలతో ఉన్న మొదటి రోగి అంటూ తాజా అధ్యయనం పేర్కొంది. అంతేకాదు హువానాన్ సీఫుడ్ మార్కెట్ నుండి యాంగ్జీ నదికి అడ్డంగా ఉన్న ఒక టాప్ వైరస్ లేబొరేటరీ నుండి ఈ వైరస్ లీక్ అయి ఉండవచ్చనే ఊహాగానాలకు జోడించింది. దీనికి సంబంధించిన నివేదిక తాజాగా సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

వుహాన్‌ నగరంలో 2019లో కరోనా వైరస్ వెలుగుచూసింది. అనంతరం ఇతర దేశాలకు వ్యాపించింది. రోజుకో రూపాన్ని మార్చుకుంటూ యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది.  అయితే 2019లో డిసెంబర్‌లో జంతు మాంసం మార్కెట్‌లో పలువురిలో కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ఇప్పటి వరకూ డిసెంబర్ 16న వైరస్ లక్షణాలు కనిపించాయని.. అతడే తొలి కరోనా కేసు అంటూ ఇప్పటివరకు అందరు భావించారు. అయితే అతని కంటే ముందుగానే అంటే డిసెంబర్ 11 వ తేదీ 2019 నే వెట్ మార్కెట్ లోని ఓ మహిళకు కరోనా వ్యాధి సోకిందని యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజొనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ మైఖేల్‌ వోరెబే  చెప్పారు. వుహాన్‌ మార్కెట్‌లో వైరస్‌ లక్షణాలు కనిపించిన వారు, ఆస్పత్రిలో చేరిన కేసులను విశ్లేషించి చూస్తే.. కోవిడ్‌ మూలాలు అక్కడే ప్రారంభమైనట్లుగా తెలుస్తోందని అన్నారు.

డిసెంబరు నుండి కోవిడ్ -19 కేసులలో చాలా వరకు హువానాన్ మార్కెట్‌కు సంబంధించినవే అని గుర్తించినట్లు.. దీనికి కారణం ఒకరి నుంచి మరికొందరికి వ్యాపించడం అని దీనికి తగిన సాక్ష్యాలున్నాయని వోరోబే చెప్పారు. అయితే ఇప్పటి వరకూ కరోనా మొదటి కేసుగా భావిస్తున్న వ్యక్తికి సంబందించిన వ్యక్తికీ మాత్రం ఈ వుహాన్‌ వెట్ మార్కెట్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఈ వెట్ మార్కెట్‌లో జంతువులను విక్రయించే మహిళకే కరోనా మొదటగా సోకిందని వెల్లడించారు.

Also Read: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క.. దశాబ్దాలుగా ఈ శునకాలు వారసత్వంగా వేల కోట్ల ఆస్తి