AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క.. దశాబ్దాలుగా ఈ శునకాలు వారసత్వంగా వేల కోట్ల ఆస్తి

Richest Dog: మనిషికి నమ్మకమైన జంతువు కుక్క.. ఇక మనదేశంలో కుక్కలను కాలభైరవులుగా పూజిస్తారు కూడా.. అయితే ఈ కుక్కలను ఎంతో ఇష్టంగా సొంత పిల్లలా..

Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క.. దశాబ్దాలుగా ఈ శునకాలు వారసత్వంగా వేల కోట్ల ఆస్తి
Richest Dog
Surya Kala
|

Updated on: Nov 21, 2021 | 7:00 AM

Share

Richest Dog: మనిషికి నమ్మకమైన జంతువు కుక్క.. ఇక మనదేశంలో కుక్కలను కాలభైరవులుగా పూజిస్తారు కూడా.. అయితే ఈ కుక్కలను ఎంతో ఇష్టంగా సొంత పిల్లలా పెంచుకుంటారు. కొంతమంది తమ కుక్కలకు పుట్టిన రోజు వంటి వేడుకలను నిర్వహిస్తూ తమకు తమ పెంపుడు జంతువుపై ఉన్న ప్రేమని చూపిస్తారు కూడా.. అయితే మరికొందరు ఏకంగా తమ ఆస్తిని కూడా కుక్కల పేరుతొ రాసే వారున్నారు. అలాంటి సమయంలో ఈ కుక్కలా బతకాలి అనుకుంటాం. ఎందుకంటే ఈ కుక్క ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేళా కోట్లకు ఆస్థిపరురారు కనుక. వివరాల్లోకి వెళ్తే..

యూఎస్‌లోని మియామిలో నివసిసున్న గుంథర్‌-VI అనే కుక్క అత్యంత సంపన్నమైన కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కకి 500 మిలియన్‌ డాలర్లు అంటే దాదాపు 3,715 కోట్ల సంపద గుంథర్‌ తాతగారైన గుంథర్‌IV అనే మరో కుక్కనుంచి వారసత్వంగా లభించింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఇలా వారసత్వంగా ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దాంతో ఈ కుక్కకు 431 కోట్ల విలువ చేసే ట్రస్ట్‌ వారసత్వంగా లభించింది. ఇలా లభించిన ఆస్తికి రోజు రోజుకూ విలువ పెరగడంతో గుంథర్‌ VI కుక్క ప్రపంచంలో అత్యంత ఆస్తి కలిగిన కుక్కగా నిలిచింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఇప్పడు ఈ కుక్కకు చెందిన టుస్కాన్ విల్లాను అమ్మకానికి పెట్టారు.

తొమ్మిది బెడ్‌రూమ్‌లు, ఎనిమిది బాత్‌రూమ్‌లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్‌ ఉండే ఈ ఇంటిని విక్రయించే బాధ్యత.. ది అసోలిన్ టీమ్‌కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్‌’ అనే సంస్థ తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ నిర్వాహకురాలు మాట్లాడతుతూ…అత్యంత ఖరీదైన ఈ భారీ సౌధానికి యజమాని కుక్క అని తెలుసుకుని నమ్మలేకపోయానని తెలిపారు. ఈ భవనానికి గొప్ప చరిత్ర ఉందని, గుంథర్ VIతో తాము సమావేశమైనప్పుడు ఆ కుక్క పరుగెత్తుకుంటూ వచ్చి తనకు ముద్దిచ్చిందని, అప్పుడు మాతో ఒప్పందం చేసుకోవడం తనకు ఇష్టమే అన్నట్లుగా ఇలా ముద్దిచ్చినట్లుందని భావిస్తున‍్నానని తెలిపారు.

Also Read:

ఈ 3 రాశులవారు వివాహానికి తొందరపడుతారు..! ఆ రాశులేంటో తెలుసా..?

మీ బిడ్డకు పేరు పెడుతున్నారా? అయితే, ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోండి..