Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 3 రాశులవారు వివాహానికి తొందరపడుతారు..! ఆ రాశులేంటో తెలుసా..?

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. దీనికోసం యువతీ యువకులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

Zodiac Signs: ఈ 3 రాశులవారు వివాహానికి తొందరపడుతారు..! ఆ రాశులేంటో తెలుసా..?
Zodiac Signs
Follow us
uppula Raju

|

Updated on: Nov 21, 2021 | 6:08 AM

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. దీనికోసం యువతీ యువకులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వివాహం అనేది మీ జీవితంలో ఉంటే మీరు కోరుకున్నా లేకపోయినా ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితే కొంతమంది పెళ్లి చేసుకుని త్వరగా సెటిల్ అవ్వాలని ఇష్టపడుతారు. మరికొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి తమ కలలను నేరవేర్చుకోవడానికి తొందరగా వివాహం చేసుకోవాలనుకుంటారు. అలాంటి మూడు రాశుల గురించి తెలుసుకుందాం.

1. సింహరాశి సింహరాశి వ్యక్తులు ముందస్తు వివాహాలను ఎక్కువగా ఇష్టపడుతారు. వారికి వారి భాగస్వామితో జీవితంలో తొందరగా స్థిరపడాలని కోరిక. అందుకోసం వివాహం తొందరగా చేసుకోవాలనుకుంటారు. వారికి సంతోషకరమైన జీవితం అంటే జీవిత భాగస్వామితో కలిసి ఉండటమే. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగమని, అది తన కలలను నెరవేర్చుతుందని భావిస్తారు.

2. మకరరాశి మకరరాశి వారు కూడా తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. చిన్నవయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల ఒకరికొకరు సర్దుకుపోవడాన్ని సులభతరం చేస్తుందని వారు నమ్ముతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో గడిపే అనుభూతిని వీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

3. మిధునరాశి మిధున రాశివారు పెళ్లికోసం ఆరాటపడుతారు. జీవితంలో త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. వీరు తమ జీవిత భాగస్వామితో ఎక్కువ జీవితాన్ని గడపాలని అనుకుంటారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి ప్రయత్ని స్తారు.

గమనిక- ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి. కేవలం సాధారణ పాఠకులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రాయడం జరిగింది.

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?