Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Effect: ఉప్పు తెగ తినేస్తున్నారా..! 30 ఏళ్లకే ఈ సమస్యలు తప్పవు..?

Salt Effect: ఉప్పు లేని జీవితాన్ని మనం ఊహించుకోలేం. ఉప్పు ఆహారం రుచిని పెంచడమే కాక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉప్పు తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన

Salt Effect: ఉప్పు తెగ తినేస్తున్నారా..! 30 ఏళ్లకే ఈ సమస్యలు తప్పవు..?
Salt
Follow us
uppula Raju

|

Updated on: Nov 21, 2021 | 6:01 AM

Salt Effect: ఉప్పు లేని జీవితాన్ని మనం ఊహించుకోలేం. ఉప్పు ఆహారం రుచిని పెంచడమే కాక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉప్పు తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన సోడియం, క్లోరైడ్ ఖనిజాలు లభిస్తాయి. మీ శారీరక పనితీరుకు సోడియం, శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి క్లోరైడ్ చాలా అవసరం. అయినప్పటికీ అధిక ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. 60 ఏళ్లలో వచ్చే వ్యాధులు దీనివల్ల 30 నుంచి 40 ఏళ్ల మధ్యలోనే అటాక్ చేస్తున్నాయి.

ఇందులో ప్రధానంగా చెప్పాలంటే గుండెపోటు. అధిక ఉప్పు తీసుకునేవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు రక్తపోటు, ఊబకాయుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. చిన్న వయసులోనే పక్షవాతం, కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నారు. WHO ప్రకారం.. ఒక వ్యక్తి సోడియం అవసరాన్ని ఐదు గ్రాముల ఉప్పుతో తీర్చవచ్చు. కానీ మనలో చాలామంది రోజుకు సగటున 9 నుంచి12 గ్రాముల ఉప్పును తింటున్నారు. బయటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్లే తెలియకుండానే ఉప్పును ఎక్కువగా స్వీకరిస్తున్నారు. చాలా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఆహారాలు, పాల, మాంసాలలో ఎక్కువగా ఉప్పు ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ ఒక టీస్పూన్ లేదా 5 గ్రాముల ఉప్పును తినాలి. ఇది ప్రామాణిక నిష్పత్తి. పిల్లలకు ఈ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. అదనంగా మీకు రోజూ అవసరమైన ఉప్పు మొత్తం మీ శారీరక శ్రమ స్థాయిని బట్టి ఉంటుంది. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆహార పరిశ్రమల్లో ఉత్పత్తి దశలోనే ఉప్పు వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. పిల్లల్లో బాల్యం నుంచి ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఇది అలవాటుగా మారి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో వండే ఆహారాల్లో ఉప్పును నియంత్రణలో ఉంచుకోవాలి. ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల్లో ఉప్పు శాతాన్ని కనిపించేటట్లుగా కవర్‌ పైభాగంలో ముద్రించాలి. ఉప్పు వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?