- Telugu News Photo Gallery Viral photos Know what is divorce month and why january got this tag read here facts
ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?
Viral Photos: సంవత్సరంలో వేర్వేరు నెలలు ఉన్నాయి. ఒక్కో నెలకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో జనవరిని విడాకుల నెల అని పిలుస్తారు.
Updated on: Nov 20, 2021 | 10:14 PM

సంవత్సరంలో వేర్వేరు నెలలు ఉన్నాయి. ఒక్కో నెలకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో జనవరిని విడాకుల నెల అని పిలుస్తారు. ఎందుకంటే ఈ నెలలో ఎక్కువగా తీసుకుంటున్నారట.

జనవరి కొత్త సంవత్సరంలో కొత్త ఆనందాలను మోసుకొస్తుంది.కానీ చాలా వరకు ఈ నెలలో విడాకులు ఎక్కువగా జరుగుతాయి. మిగతా అన్ని నెలలను పరిగణనలోకి తీసుకుంటే జనవరిలో విడాకుల కేసుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువ.

నిపుణులు జనవరిని 'విడాకుల మాసం' అని పిలవడం ప్రారంభించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ మెట్రోపాలిటన్ లాయర్స్ ప్రకారం.. చాలా విడాకుల కేసులు జనవరిలోనే జరుగుతాయి. దీనికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.

వివాహ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త సంవత్సరంలో విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. జీవితాన్ని కొత్త మార్గంలో ప్రారంభించాలనుకుంటున్నారు. పరస్పర ఒప్పందం ద్వారా విడిపోవాలని నిర్ణయానికి వస్తారు.

కొత్త సంవత్సరం సెలవుల మాసం విడాకులు తీసుకోవడానికి కూడా అనుకూలం. సెటిల్మెంట్ కూడా సులభంగా అవుతుంది.



