- Telugu News Photo Gallery Viral photos 34 year old grandmother mistaken as aunty of grand daughter see images
Viral Photos: ఈ తల్లి, కూతురు ఒక మాదిరిగా కనిపిస్తారు.. ఫొటోలు చూస్తే షాక్ అవుతారు..
Viral Photos:తల్లీకూతుళ్ల అనుబంధం చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు వారు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. చాలాసార్లు తల్లి పోలికలు కూతురుకి వస్తాయి.
Updated on: Nov 19, 2021 | 11:09 PM

తల్లీకూతుళ్ల అనుబంధం చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు వారు ఒకరికొకరు మంచి స్నేహితులు కూడా. చాలాసార్లు తల్లి పోలికలు కూతురుకి వస్తాయి. తాజాగా ఇంగ్లాండ్‌లో ఒకే మాదిరిగా కనిపించే తల్లీ, కూతురులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

34 ఏళ్ల క్లైర్ మిల్నర్, ఆమె 18 ఏళ్ల కుమార్తె ఎల్సీ ఇద్దరు ఒకేలా ఉంటారు. వీరి లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

క్లైర్ మిల్నర్ ఇలా చెబుతోంది. 'అందరు నన్ను నీ కూతురికి సోదరిలా ఉన్నావని అంటారు. నేను ఈ మాటలను చాలా ఎంజాయ్ చేస్తాను' అని చెప్పింది.

ఇటీవల క్లైర్ కుమార్తె ఎల్సీ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో తల్లి క్లైర్ కూడా ఏడాది క్రితం ఒక కుమారుడికి జన్మనిచ్చింది. అయితే ఈ ఇద్దరు తల్లీ కూతురులు వారి పిల్లలతో కలిసి ఔటింగ్‌కి వెళ్లడం వారికి వింతగా అనిపిస్తుంది.

క్లైర్ మిల్నర్‌కి ఏడాది క్రితం కొడుకు పుట్టిన తర్వాత ఆమె కూతురు కూడా గర్భవతి అయింది. ఇప్పుడు వీరిద్దరి పిల్లలు దాదాపు ఒకే వయస్సు వారు అంతేకాదు ఒకేలా కనిపిస్తారు.





























