Health Tips: ఈ 5 చిట్కాలు.. ఉదర సమస్యల నుండి బయటపడేందుకు దివ్యౌషధాలు..

Health Tips: పాదాలు వెచ్చగా, కడుపు మృదువుగా, తల చల్లగా ఉండేవాడే ఆరోగ్యవంతుడని ఆయుర్వేదంలో చెప్పబడింది.

Health Tips: ఈ 5 చిట్కాలు.. ఉదర సమస్యల నుండి బయటపడేందుకు దివ్యౌషధాలు..
Stomach
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 10:11 PM

Health Tips: పాదాలు వెచ్చగా, కడుపు మృదువుగా, తల చల్లగా ఉండేవాడే ఆరోగ్యవంతుడని ఆయుర్వేదంలో చెప్పబడింది. కానీ నేటి కాలంలో ప్రతిదీ పూర్తిగా విరుద్ధంగా మారింది. కలుషిత ఆహారం, మితిమీరిన ఒత్తిడి మొదలైన వాటి ప్రభావం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా సమయ పాలన లేని జీవన శైలి కారణంగా ఉదర సమస్యలు సర్వసాధారమయ్యాయి.

రిచ్, స్పైసీ ఫుడ్ తినడం, అర్థరాత్రి డిన్నర్ చేయడం వంటి అలవాట్లు ఉదర సమస్యలకు ప్రాధాన కారణం. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. కడుపు అన్ని రకాల వ్యాధులకు మూలంగా పేర్కొంటారు. కడుపును సరిగా ఉంచుకుంటే.. అన్ని సమస్యలను అధిగమించవచ్చు. కాగా.. గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి, అసిడిటీ మొదలైన ప్రతి సమస్య నుంచి ఉపశమనం కలిగించే 5 చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తెల్లవారుజామున రాగి పాత్రలో నీటిని తాగాలి.. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నిటీని ఉంచి.. ఉదయాన్నే తాగాలి. అలా తాగడం వలన కడుపులోని వ్యర్థాలు అన్నీ మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. అయితే, ఈ పాత్రను చెక్క బల్లపై గానీ, రాతిబండపై గానీ ఉంచాలి. నేలపై మాత్రం అస్సలు పెట్టవద్దు.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా ఉంటే.. తిన్న ఆహారం సులువగా జీర్ణమవుతుంది. తద్వారా ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. పండ్లు, తృణధాన్యాలు, పచ్చి కూరగాయలు, చిక్కుళ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవాలి. అర్థరాత్రి వేళల్లో ఆహారం తినే అలవాటును మార్చుకోవాలి.

వేడి నీరు తాగాలి.. ఉదర సమస్యలను నియంత్రించడానికి వేడి నీరు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఆహారం తిన్న తరువాత గోరువెచ్చని నీటిని తాగే జీర్ణక్రియ మొరుగుపడుతుంది. ప్రతీరోజు కనీసం ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు తాగాలి. అన్న తిన్న అరగంట తర్వాత కూడా వేడి నీరు తాగాలి.

యోగా, వ్యాయామం.. త్రికోణాసనం, పశ్చిమోత్తనాసనం, పవన్ముక్తాసనం వంటి యోగాసనాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే యోగా, వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయాలి. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలి. ఉదయం వాకింగ్ వేగంగా చేయాలి. సాయంత్రం మాత్రం కొంచె మెల్లగా నడవాలి. ఆ తరువాత వజ్రాసనంలో కూర్చోవాలి.

ఉపవాసం.. వారంలో ఒకరోజు ఉపవాసం పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీని కారణంగా, శరీంలోని విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.

Also read:

Monkey Viral Video: సైకిల్‌పై సరదగా బడికి వెళ్తోన్న వానరం.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..!

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

Liquor vs Food: మద్యం సేవిస్తూ ఇవి తింటున్నారా? ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.