Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor vs Food: మద్యం సేవిస్తూ ఇవి తింటున్నారా? ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..!

Liquor vs Food: ప్రస్తుత కాలంలో చాలామంది మద్యం తాగుతారనడంలో అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు.. యుక్త వయస్సుకు..

Liquor vs Food: మద్యం సేవిస్తూ ఇవి తింటున్నారా? ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..!
Wine
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 10:01 PM

Liquor vs Food: ప్రస్తుత కాలంలో చాలామంది మద్యం తాగుతారనడంలో అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు.. యుక్త వయస్సుకు వచ్చిన వారుసైతం చాలా మంది మద్యం సేవించడం ప్రస్తుతం చూస్తునే ఉన్నాం. అయితే, మద్యం సేవించే సమయంలో మంచింగ్‌గా ఇతర ఆహార పదార్థాలను తినడం సాధారణం. అయితే, ఆల్కాహాల్‌ సేవించే సమయంలో కొన్ని రకాల ఫుడ్స్ తినొద్దని మీకు తెలుసా? అవి తింటే ప్రాణాలకే ప్రమాదం అని తెలుసా? అయితే, ఇప్పుడు తెలుసుకుని జాగ్రత్త పడండి.

జీడిపప్పు, వేరుశెనగ తినకూడదు.. సాధారణంగా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు వేరుశెనగ తినడానికి ఇష్టపడతారు. అంతే కాదు చాలా మంది ఎండు జీడిపప్పు కూడా తింటారు. అయితే ఆల్కహాల్‌ తాగేటప్పుడు ఎప్పుడూ ఈ ఫుడ్‌ని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిలో కొలెస్ట్రాల్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆల్కహాల్‌తో పాటు శరీరంలోకి వెళ్లడం ద్వారా.. శరీరంలో ఫ్యాట్ స్థాయి పెరుగుతుంది.

సోడా, కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం.. మద్యాన్ని సోడా, కూల్‌డ్రింక్స్‌తో కలిపి అస్సలు సేవించకూడదు. ఈ రెండూ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందువల్ల, వాటికి బదులుగా నీళ్లు, ఐస్ కలిపిన మద్యం సేవించడం ఉత్తమం.

ఫ్రై చేసిన స్నాక్స్ తినొద్దు.. మద్యం సేవించేటప్పుడు.. ఫ్రై చేసిన స్నాక్స్ అస్సలు తినొద్దు. చాలా మంది మద్యపానం చేసేటప్పుడు స్నాక్స్‌గా చిప్స్ తింటారు. అయితే, అవి ఆరోగ్యానికి హానీ తలపెడతాయని అంటున్నారు నిపుణులు.

పాల ఉత్పత్తులను తినొద్దు.. సాధారణంగానే ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అందులోనూ ఆల్కాహాల్ తాగిన తరువాత పాలు తాగితే.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాలలో ఉన్న పోషకాలేవీ శరీరానికి పూర్తిస్థాయిలో అందవు. అయితే, తక్కువ మోతాదులో మద్యం తాగితే మాత్రం పాలు తాగొచ్చు.

స్వీట్లు తినకూడదు.. మద్యం సేవించినప్పుడు స్వీట్లు అస్సలు తినొద్దు. మద్యం తాగినప్పుడు స్వీట్లు తింటే.. మత్తు రెట్టింపు అవుతుంది. మద్యం సేవించిన తరువాత తీపి పదర్థాలు తినడం విషంతో సమానం అని చెబుతున్నారు.

Also read:

9 సిక్స్‌లు, 5 ఫోర్లు.. 550 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బౌలర్లపై విరుచుకపడిన ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్‌ ఎవరంటే?

Viral Video: ట్రక్ డ్రైవర్‌లా మారిన పైలట్.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..

Varshini Sounderajan: తన ఒంపుసొంపులతో ఫిదా చేస్తున్న వర్షిణి లేటెస్ట్ పిక్స్