Milk: ఒరిజినల్ అనుకుంటే మోసపోయినట్టే.. మార్కెట్లో నకిలీ పాలు.. చూస్తే షాక్..
పాలు.. స్వచ్చతకు నిదర్శం. తెల్లనివన్ని పాలని అని ఊరికే అన్నారా ? పాలు ప్రతిరోజూ ఉదయం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే.
పాలు.. స్వచ్చతకు నిదర్శం. తెల్లనివన్ని పాలని అని ఊరికే అన్నారా ? పాలు ప్రతిరోజూ ఉదయం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే. పాలు అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. ఇక పసి పిల్లలకు పాలు తప్పనిసరి. వీటితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. పాలతో టీ.. కాఫీ.. నెయ్యి, పన్నీర్, కోవా వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తారు. అలాంటి స్వచ్చమైన పాలను నకిలీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో తాగే నీటి నుంచే తినే తిండి వరకు ప్రతిదీ కల్తీ చేస్తున్నారు. ఉప్పు, కారం, పాలు, నీళ్లు, ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ కల్తీనే.
ఇక నకిలీకి.. అసలును గుర్తుపట్టడం కష్టమే. దీంతో నకిలీ పదార్థాలను తీసుకోవడం వలన ప్రజలు ప్రాణాలతో పోరాడుతున్నారు. గతంలో పాలు కల్తీ చేస్తున్న సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్వచ్చమైన పాలను యూరియాతో తయారు చేస్తున్నారు. నకిలీ పాలు.. తాగి పసి పిల్లల నుంచి పెద్దవారికి అనారోగ్యానికి గురవుతున్నారు.
పైన ఫోటోలో కనిపిస్తున్న పాల ప్యాకెట్స్‌లో నకిలీది.. ఒరిజినల్ ఏదో గుర్తుపట్టండి చూద్ధాం. కాస్త కష్టమే అనుకోండి. రెండు పాల ప్యాకెట్స్ ఒకే మాదిరిగా ఉన్నాయి కదా.. కానీ అందులో నకిలీ పాల ప్యాకెట్ కూడా ఉంది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అమూల్ మిల్క్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ పాలను ప్రతి ఒక్కరు ఉపయోగిస్తుంటారు. ఈ బ్రాండ్ మిల్క్ దేశంలో అత్యంత గుర్తింపు ఉన్నవి. అయితే ఇంతటి పేరున్న పాలను సైతం నకలీ చేస్తున్నారు కొందరు. తాము సృష్టించిన నకిలీ పాలకు అమూల్ బ్రాండ్ మాదిరిగానే సేమ్ ప్యాకెట్ సృష్టించారు. కానీ అందులో అమూల్‌కు బదులుగా అనూల్ అని ప్రింట్ చేసి విక్రయిస్తున్నారు. ఈ నకిలీ పాల ప్యాకెట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాల ప్యాకెట్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Read: John Abhramham: అభిమాని ఫోన్ లాకెళ్లిన స్టార్ హీరో.. షాకైన ఫ్యాన్.. చివరకు ఏం చేశాడంటే..
Kaikala Satyanarayana: నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ బులెటిన్ విడుదల.. పరిస్థితి మరింత విషమం..
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి భవనంలో మంటలు.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..