John Abhramham: అభిమాని ఫోన్ లాకెళ్లిన స్టార్ హీరో.. షాకైన ఫ్యాన్.. చివరకు ఏం చేశాడంటే..
సాధారణంగా తన అభిమాన హీరోను ఒక్కసారైన చూడాలని అనుకుంటున్నారు. తమ హీరోలను కలుసుకునేందుకు.. వారితో ఒక ఫోటో

సాధారణంగా తన అభిమాన హీరోను ఒక్కసారైన చూడాలని అనుకుంటున్నారు. తమ హీరోలను కలుసుకునేందుకు.. వారితో ఒక ఫోటో దిగేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు అభిమానులు. ఇక తమకు ఇష్టమైన హీరోలు రోడ్డు మీద కనిపిస్తే ఊరుకుంటారు.. కానీ తన ఫ్యాన్స్‌కు ఊహించని షాకిచ్చాడు ఓ స్టార్ హీరో. దీంతో ఆ అభిమాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జాన్ అబ్రహం ఒకరు. ఈ కండల వీరుడికి యూత్‌లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అలాంటి హీరో రోడ్డు మీద కనిపిస్తే ఊరుకుంటారా ?.. తాజాగా జాన్ అబ్రహం ఉదయం వాకింగ్ కు వెళ్తున్న సమయంలో అతనితో సెల్ఫీలో బంధించాలని తపించారు. జాన్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. అతడు వెళ్లే మార్గంలో దూరం నుంచి బైక్ మీద కూర్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది గమనించిన జాన్ అబ్రహం వాళ్ల దగ్గరకు రాగానే వెనక నుంచి ఫోన్ లాక్కుని వెళ్లిపోయారు. దీంతో షాకైన అభిమానులు జాన్ ను అనుసరించి ఫోన్ తీసుకున్నారు. ఈ వీడియోను జాన్ అబ్రహం ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇక జాన్ చేసిన సరదా పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇక జాన్ నటించిన సత్యమేవ జయతే 2 సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది. మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జాన్ అబ్రహం నటించిన “ముంబైసాగా” రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
Also Read: Kaikala Satyanarayana: నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ బులెటిన్ విడుదల.. పరిస్థితి మరింత విషమం..
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి భవనంలో మంటలు.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..