Viral Photo: ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి చూద్దాం.. గుర్తించకపోతే ఈ స్టోరీ చదవండి!
కంటెంట్ క్రియేటర్స్ కూడా తమ పంధాను మార్చుకుంటూ.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు సరికొత్త పజిల్స్, ఫోటోలు..

లాక్‌డౌన్ తర్వాత నుంచి ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లకు కావలసినన్ని ఫన్ ఎలిమెంట్స్ దొరుకుతున్నాయి. కంటెంట్ క్రియేటర్స్ కూడా తమ పంధాను మార్చుకుంటూ.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు సరికొత్త పజిల్స్, ఫోటోలు, వీడియోలను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక వీకెండ్ వస్తే చాలు.. వర్క్‌తో అలసిపోయిన మనసులకు కాస్త విశ్రాంతిని ఇచ్చేందుకు జనాలు వెబ్ స్టోరీస్, వీడియోలు, రకరకాల ఫోటోల కోసం నెట్టింట సెర్చ్ చేస్తుంటారు. ఆ కోవలో ప్రాచుర్యం పొందినవి ఫోటో పజిల్స్.
పజిల్స్‌ను సాల్వ్ చేయడానికి నెటిజన్లు తెగ ఆరాటపడతారు. అవి ఫోటోగ్రాఫర్ మాయో, లేక ఫోటోషాప్ మేజికో తెలియదు గానీ.. అలాంటి ఫోటోలు మాత్రమే చూపరులను ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాతదే అయినా మరోసారి వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం పదండి..
Today in find the cat pic.twitter.com/P6soGOv8k1
— Kate Hinds (@katehinds) June 7, 2020
పైన పేర్కొన్న ఫోటోలో ఓ పిల్లి దాక్కుంది. ఓ రూమ్‌లోని బుక్స్ షెల్ఫ్ మధ్య ఈ పిల్లి ఇంచక్కా సేద తీరుతోంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. ఇక ఈ చిత్రంలో పిల్లిని మొదటిగా ‘Kate Hinds’ అనే నెటిజన్ కనిపెట్టింది. ఆమె ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసి.. పిల్లిని కనిపెట్టండి అని పేర్కొంటూ.. యూజర్లకు పజిల్ విసిరింది. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ పజిల్‌కు 48 వేల రీ-ట్వీట్స్, 2 లక్షల లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి..
— Kate Hinds (@katehinds) June 7, 2020