Love: ప్రియుడు మాట్లాడటం లేదని 100 నెంబర్‌కు ఫోన్ చేసిన ప్రియురాలు.. చివరకు పోలీసులు ఏం చేశారంటే..?
Love Story: బాయ్‌ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని.. ఎలాగైనా అతనితో మాట్లాడించాలంటూ ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. 100 నంబర్‌కు ఫోన్ హాడావుడి చేయడంతో.. పోలీసులు
Love Story: బాయ్‌ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదని.. ఎలాగైనా అతనితో మాట్లాడించాలంటూ ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. 100 నంబర్‌కు ఫోన్ హాడావుడి చేయడంతో.. పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వారాలో చోటుచేసుకుంది. చింద్వారాకు చెందిన మహిళకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇద్దరి మధ్య సంబంధానికి దారి తీసింది. అయితే ఇటీవల ఆ వ్యక్తి జన్మదినం జరిగింది. పుట్టిన రోజు నాడు.. ఆ మహిళ.. అతనికి విష్ చేయలేదని గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడాన్ని ఆపేశారు. ఆ తర్వాత మహిళ అతనితో మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ.. ఆ వ్యక్తి మాట్లాడటం లేదు. దీంతో బెంగ పెట్టుకున్న ఆ మహిళ కొంతకాలంగా మదనపడుతోంది.
ఎప్పుడు మాట్లాడాలని.. ఫోన్ చేసినా.. తారసపడినా.. అతడు మాత్రం మొహం చాటేశాడు. దీంతో ఆమె అతనితో ఎలాగైనా మాట్లాడాలని డిసైడ్ అయింది. దీనికి పోలీసులు అయితే.. పరిష్కారం చూపుతారనుకొని.. ప్లాన్ వేసింది. దీంతో వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి.. లవర్ తనతో మాట్లాడటం లేదంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ మహిళ దగ్గరికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి మహిళకు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత.. ఇరు కుటుంబసభ్యుల ఒప్పందంతో ఆర్య సమాజ్‌లో ఇద్దరి పెళ్లి చేశారు. దీంతో శుభం కార్డు పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త.. మధ్యప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: