AP Floods: రెస్క్యూ చేస్తుండగా ప్రమాదం.. తండ్రీకొడుకులను కాపాడి చనిపోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్.. 

SDRF Constable died : ఏపీలో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల విషాద ఘటనలు నెలకొంటున్నాయి. వరదల్లో సహాయక చర్యల కోసం కోసం వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్

AP Floods: రెస్క్యూ చేస్తుండగా ప్రమాదం.. తండ్రీకొడుకులను కాపాడి చనిపోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్.. 
Nellore
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 6:42 PM

SDRF Constable died : ఏపీలో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల విషాద ఘటనలు నెలకొంటున్నాయి. వరదల్లో సహాయక చర్యల కోసం కోసం వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని దామరమడుగు వాగు వద్ద నీటిలో ఇరుక్కున్న తండ్రీకొడుకులను రక్షించిన శ్రీనివాసరావు అనే ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్.. ఆ తర్వాత ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతై మృతి చెందాడు. వరదలో చిక్కుకున్న తండ్రీకొడుకులను కాపాడిన శ్రీనివాసరావు.. అనంతరం నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.

రెస్క్యూ చేస్తున్న క్రమంలో లైఫ్ జాకెట్ జారిపోవడంతో వరద ఉద్ధృతికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. తమ ప్రాణాలను కాపాడిన ఆ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవడం ఆ తండ్రీకొడుకులను కలచివేసింది. వారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం కానిస్టేబుల్ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. కాగా.. ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు భౌతికకాయానికి జిల్లా ఎస్పీ విజయరావు ఘననివాళి అర్పించారు. విధుల్లో బాధ్యతతో శ్రీనివాసరావు పనిచేస్తారని తెలిపారు.

కాగా.. నెల్లూరు గత రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు అలెర్ట్‌ జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Also Read:

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!