Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

Naga Babu Comments: చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం బాధ కలిగించింది.. వ్యక్తిగత విమర్శలు, దూషణలు సరికాదు.. విమర్శలు సహజం కానీ.. మరి ఇంతగా దిగజారి ప్రవర్తించడం

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..
Nagababu
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 6:42 PM

Naga Babu Comments: చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం బాధ కలిగించింది.. వ్యక్తిగత విమర్శలు, దూషణలు సరికాదు.. విమర్శలు సహజం కానీ.. మరి ఇంతగా దిగజారి ప్రవర్తించడం అసహ్యకరమైనటువంటి పని అంటూ మెగా బ్రదర్ నాగబాబు.. పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని దూషించిన ఘటనపై నాగబాబు శనివారం స్పందించారు. ఎవరైనా విమర్శలు చేయడం సహజం కానీ.. దూషణలు చేయడం మంచిదికాదని హితవు పలికారు. ఎవరైనా, ఏ పార్టీ అయినా విమర్శంచుకోవడం మంచిదే కానీ.. దిగజారి ప్రవర్తించడం సరికాదన్నారు. ఏపీ రాజకీయం రోజురోజుకు పరాకాష్టకు చేరుతుందని నాగబాబు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు లాంటి సీనియర్ నాయకులు కన్నీళ్లు పెట్టుకోవడం చాలా బాధ కలిగించిందన్నారు. తాను చంద్రబాబు అభిమానిగా చెప్పడం లేదని.. కంటతడి పెట్టుకున్న తీరు దు:ఖించిందన్నారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని, ముఖ్యంగా కుటుంబసభ్యులను దీనిలోకి లాగొద్దంటూ హితవు పలికారు. అందరూ పార్టీల పాలసీల ప్రకారం విమర్శించుకోవాలని సూచించారు. జనసేనను కూడా విమర్శించవచ్చని పేర్కొన్నారు.

సీఎం జగన్ మీద టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా దూషించడం కూడా కరెక్ట్ కాదని నాగబాబు అభిప్రాయపడ్డారు. మళ్లీ నిన్న చంద్రబాబును చూసిన తర్వాత తన మనసు కలచివేసిందని నాగబాబు పేర్కొన్నారు. ఎవరైనా సరే కుసంస్కారమైన పనులు చేయొద్దంటూ మెగా బ్రదర్ హితవు పలికారు.

Also Read: 

Jr NTR: వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Viral Video: వాహ్.. ఏం తెలివి ఈ కుక్కది.. రెండు శునకాలు కొట్టుకుంటుంటే.. మూడోది వచ్చి..!