Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాహ్.. ఏం తెలివి ఈ కుక్కది.. రెండు శునకాలు కొట్టుకుంటుంటే.. మూడోది వచ్చి..!

Viral Video: రెండు పిల్లులు ఒక రొట్టె కోసం కొట్లాడుకుంటుంటే.. మధ్యవర్తిగా వచ్చిన ఓ కోతి ఆ రెట్టెనంతటినీ లాగేసుకెళ్తుంది.

Viral Video: వాహ్.. ఏం తెలివి ఈ కుక్కది.. రెండు శునకాలు కొట్టుకుంటుంటే.. మూడోది వచ్చి..!
Gods
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 20, 2021 | 4:22 PM

Viral Video: రెండు పిల్లులు ఒక రొట్టె కోసం కొట్లాడుకుంటుంటే.. మధ్యవర్తిగా వచ్చిన ఓ కోతి ఆ రెట్టెనంతటినీ లాగేసుకెళ్తుంది. ఈ నీతిసూత్రం మనందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలో తెలివైన జంతువులో శునకాలకు ప్రథమ స్థానం అని చెప్పాలి. మనుషుల నడవడికను, భాషను, సంజ్ఞలను అర్థం చేసుకుని అందుకు తగిన రీతిలో స్పందిస్తుంటాయి. మనం సంతోసంగా ఉన్నా.. విచారంగా ఉన్నా.. ప్రతీ అనుభూతిని అవి అర్థం చేసుకోగలుగుతాయి. అలాంటి శునకాలు.. స్వజాతి విషయానికి వచ్చేసరికి కొంచెం విరుద్ధంగా వ్యవహరిస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. పైన చెప్పుకున్న రెండు పిల్లులు, కోతుల కథ గుర్తుకు వస్తుంది.

ఇంతకీ ఈ వైరల్ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. కుక్కకు గిన్నెలో ఆహారం పెట్టారు. ఆ ఆహారాన్ని ఒక కుక్క తింటుండగా.. మరో కుక్క కూడా వచ్చి తినేందుకు ప్రయత్నించింది. దాంతో ఆగ్రహించిన ముందు కుక్క.. దాంతో పోట్లాటకు దిగింది. అదే సమయంలో వచ్చిన మరో కుక్క కూడా వచ్చింది. మిగతా రెండు కుక్కలు పోట్లాడుకుంటుంటే.. ఇది మాత్రం సైలెంట్‌గా తన పని తాను కానిచ్చేసింది. గిన్నెలో ఉన్న ఆహారాన్నంతా తేరగా కుమ్మేసింది. ఆ తరువాత పోట్లాడుకుంటున్న కుక్కను చూస్తు(ఎడ్డి మాలోకాలు అనుకుంటున్నట్లుగా) హాయిగా వెళ్లిపోయింది.

ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘నో వర్డ్స్’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే తెగ వైరల్ అయ్యింది. వేలాది వ్యూస్ రాగా, వందల కొద్ది లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. రాజకీయ నాయకుల దమననీతి కూడా ఇలాగే ఉంటుందంటూ రాజకీయాలకు, కుక్కల పోట్లాటకు ముడిపెడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో గొప్ప పాఠాన్ని అందించిందని మరికొందరు పేర్కొన్నారు. ‘మనం మన పనులను ప్రశాంతంగా, వివేచనతో చేయాలి. ఇలా కాకుండా ఇతరులపై ఆధారపడి చేస్తే ఇలాగే అవుతుంది.’ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

Viral Video:

Also read:

Bangarraju: అక్కినేని అభిమానులకు డబుల్ ట్రీట్.. ఫస్ట్ లుక్, టీజర్‏తో బంగార్రాజు సందడి..

Naga Chaitanya: ఇది నా జీవితానికి గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన నాగచైతన్య..

Faria Abdullah : ముద్దమందారం ఈ మనోహరి రూపం.. చిట్టి అందానికి కుర్రాళ్ళు అవ్వకుండా ఉండగలరా దాసోహం..