AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ఇది నా జీవితానికి గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన నాగచైతన్య..

Naga Chaitanya: వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత అటు చైతన్యతో పాటు ఇటు సమంత తమ వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు...

Naga Chaitanya: ఇది నా జీవితానికి గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన నాగచైతన్య..
Nagachaitanya
Narender Vaitla
|

Updated on: Nov 20, 2021 | 2:01 PM

Share

Naga Chaitanya: వివాహ బంధం నుంచి విడిపోయిన తర్వాత అటు చైతన్యతో పాటు ఇటు సమంత తమ వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే లవ్‌ స్టోరీ చిత్రంతో నాగ చైతన్య సూపర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు సమంత ఇటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పాటు అటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది. విడాకుల తాలూకు బాధను మర్చిపోవడానికే ఇలా వరుస సినిమాలతో బిజీగా మారుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే విడాకుల నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి సమంత ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది సమంత. తన భావాలను వ్యక్తపరిచేలా రకరకాల కొటేషన్స్‌ పోస్ట్‌ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా నాగచైతన్య కూడా ఇలాంటి ఓ ఫోటోనే పోస్ట్ చేశాడు.

సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని నాగచైతన్య తాజాగా చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా నాగ చైతన్య బుక్‌ రీడింగ్‌ అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాథ్యూ మాక్కోనాగై అనే రచయిత రాసిన బుక్‌ను పూర్తి చేశాడు చై. ఈ విషయాన్ని ఇన్‌స్టావేదికగా షేర్‌ చేసిన నాగచైతన్య.. ‘జీవితానికి ఇదొక ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు మాథ్యూకి కృతజ్ఞతలు. ఈ పుస్తకం నా జీవితానికి ఒక గ్రీన్‌ సిగ్నల్‌ లాంటిది’ అంటూ రాసుకొచ్చాడు.

దీంతో ఈ పోస్ట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. నాగచైతన్య చేసిన ఈ పోస్ట్‌కి అర్థం ఏంటన్న దానిపై నెటిజన్లు కారణాలు వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం తెలుగులో ‘థాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక వీటితో పాటు అమెజాన్‌ ఓటీటీలో రిలీజ్‌ కానున్న ఓ వెబ్‌ సిరీస్‌లోనూ చై నటిస్తున్నాడు. చైతన్య ఇందులో తొలిసారి నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Nandamuri Balakrishna: ‘నా సోదరి జోలికి వస్తారా’.. వైసీపీ నేతల కామెంట్స్‌పై నిప్పులు చెరుగిన బాలయ్య..(వీడియో)

Viral Video: సో క్యూట్.. చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు.. ఫిదా అవుతారు

Tirupati Rains: భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం..తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి..