Viral Video: సో క్యూట్.. చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు.. ఫిదా అవుతారు

నేచర్ చాలా గొప్పది. అన్ని జీవులకు సమానంగా బ్రతికే హక్కు ఇచ్చింది. అందర్నీ తన బిడ్డల్లా సాకుతుంది. అయితే మనుషులు దారితప్పారు.

Viral Video: సో క్యూట్.. చేపలకు తన నోటితో ఆహారం అందిస్తోన్న బాతు.. ఫిదా అవుతారు
Duck Feeds Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 20, 2021 | 10:55 AM

నేచర్ చాలా గొప్పది. అన్ని జీవులకు సమానంగా బ్రతికే హక్కు ఇచ్చింది. అందర్నీ తన బిడ్డల్లా సాకుతుంది. అయితే మనుషులు దారితప్పారు. ప్రకృతిని విచ్చిన్నం చేస్తున్నారు. వినాశనం దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఈ ప్రకృతి ప్రకోపాలు, వైపరిత్యాలు. ఇతర జీవులు మాత్రం ప్రకృతి తమకిచ్చిన విధులను నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా.. జంతువులతో పాటు వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా క్యూట్‌గా, ఎమోషన్‌గా అనిపిస్తాయి. తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం. సదరు వీడియోలో బాతు చేపలకు ఆహారం అందిస్తోంది. నోటి ద్వారా వాటికి ఆహారం చేరవేస్తోంది. బాతు అందిస్తోన్న ఆహారం అందుకునేందుకు చేపలు ఒకదాని వెంట ఒకటి అక్కడికి చేరకుంటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ముందుగా వీడియో వీక్షించండి.

చూశారుగా బాతు.. చేపలకు ఆహారం ఎలా అందిస్తుందో.  మనుషుల్లో చాలామంది ఉంటారు. తాము తిన్నాక మిగిలింది కూడా పక్కనవాళ్లకు ఇవ్వడానికి ఇష్టపడరు. తమ సొత్తునంతా ఎవరికో ఇస్తున్నట్లు ఫీల్ అవుతారు. కానీ మూగ జీవాలు ఇలాంటి విషయాల్లో తాము మనుషుల కంటే చాలా బెటర్ అని నిరూపిస్తున్నాయి. ఈ వీడియోను animals_geolife అనే ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 85 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఈ అందమైన వీడియోకు ముచ్చటైన కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: AP Weather: వెదర్ అప్‌డేట్.. ఏపీకి పొంచి ఉన్న మరో గండం