Tirupati Rains: భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం..తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి..

Tirupati Rains: గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో..

Tirupati Rains: భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం..తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి..
Tirumala Rains
Follow us

|

Updated on: Nov 20, 2021 | 10:01 AM

Tirupati Rains: గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో గత 25 ఇళ్లల్లో ఎన్నడో లేనంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో తిరుమల లోని మాడవీధులు, శ్రీవారి దర్శనం కోసం వెళ్లే కొన్ని కంపార్ట్మెంట్స్ వరద నీటితో నిండిపోయాయి. చెరువులను తలపిస్తున్నాయి.  శ్రీవారి కొండపైకి చేరుకునే నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో టీటీడీ అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసివేశారు. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి , వరద ప్రభావానికి శ్రీవారి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమైంది.   శ్రీవారి మెట్లు కొట్టుకుపోయాయి. బండరాళ్లలు పైకి వచ్చి.. నడవడానికి వీలులేకుండా రాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది. దీంతో టీటీడీ అధికారులు మరమత్తు పనులు చేపట్టనున్నారు. మరోవైపు శ్రీవారి భక్తులు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ భక్తులకు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే  శ్రీవారి దర్శనం కోసం వెళ్లే అలిపిరి ఘాట్ రోడ్డు నుంచి వాహనాల రాక పోకలను పునరుద్ధరించింది. మరోవైపు అలిపిరి మెట్ల మార్గంలో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇక కొండచరియలు విరిగిపడి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలను ముందుగా మూసివేసింది టీటీడీ. ఒక్క ఘాట్ రోడ్డు మీద నుంచి మాత్రమే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.

క‌పిలేశ్వరాల‌యం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లో సైతం భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో.. ఈ మార్గాలల్లోని భక్తులు పయనించడానికి అనుమతిని టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారు. వర్షం , వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే అనుమతించనున్నామని చెప్పారు, మరోవైపు వరదలకు వన్య మృగాలు సైతం రోడ్లమీదకు వస్తున్నాయి. Also Read:  నీకు తిండి పెట్టలేం బాబు.. అతడిని రెస్టారెంట్‌కు రావొద్దని వేడుకుంటున్న యాజమాన్యం.. కడప జిల్లాలో భారీ వర్షాలు.. జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు. మరికొన్ని దారిమల్లింపు.. వివరాల్లోకి వెళ్తే..