AP Heavy Rains: కడప జిల్లాలో భారీ వర్షాలు.. జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు. మరికొన్ని దారిమల్లింపు.. వివరాల్లోకి వెళ్తే..
AP Heavy Rains: కడప జిల్లా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడప మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు..
AP Heavy Rains: కడప జిల్లా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడప మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కడప జిల్లా జిల్లాలో పలు పాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. ఆ మార్గంలో ఈరోజు వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు అధికారులు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు
చెన్నై, తిరుపతి నుంచి కడప మీదుగా నడిచే రైళ్ల సర్వీసులు రద్దు చేశారు. అంతేకాదు రేణిగుంట- గుంతకల్లు, గుంతకల్లు-రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైల్వే సర్వీస్ రద్దు చేసినట్లు ప్రకటించారు. కడప-విశాఖపట్నం, విశాఖపట్నం కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేశారు. ఔరంగబాద్ రేణిగుంట, చెన్నై లోకమాన్య తిలక్, చెన్నై అహ్మదాబాద్, మదురై లోకమాన్య తిలక్ మధ్య నడిచే రైళ్ల రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
దారి మళ్లించిన రైళ్లు.. వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, ముంబై ఎక్స్ ప్రెస్, గోవా, హజ్రత్ నిజముద్దిన్ రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు ప్రకటించారు.
Also Read: భారీ వర్షాలు, వరదలతో పెన్నా నది ఉగ్రరూపం.. నెల్లూరు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్భంధం..