AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore Floods: భారీ వర్షాలు, వరదలతో పెన్నా నది ఉగ్రరూపం.. నెల్లూరు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్భంధం..

Nellore Floods and Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బధంలో చిక్కుకున్నాయి. పెన్నా వర్షాలు, వరదలతో..

Nellore Floods: భారీ వర్షాలు, వరదలతో పెన్నా నది ఉగ్రరూపం.. నెల్లూరు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్భంధం..
Nellore Floods
Surya Kala
|

Updated on: Nov 20, 2021 | 7:47 AM

Share

Nellore Floods and Rains: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బధంలో చిక్కుకున్నాయి. పెన్నా వర్షాలు, వరదలతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నెల్లూరు నగర ప్రజలు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. సోమశిల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగు ప్రాంతాలైన జయలలిత నగర్ కు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ గ్రామ ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని అధికారులు సూచించారు. మరోవైపు కోవూరు మండలం పెనుబల్లి, కాకుల పాడు సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. భగత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ఎగువ ప్రాంతాల్లోని వర్షాలు, వరదలతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు మరో నాలుగు గంటల్లో నీటి మట్టం మరింత పెరగనుందని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

భారీగా పంట నష్టం…

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా పంట నష్టం జరిగింది. 5173 హెక్టార్లలో వరి, 12 హెక్టార్లలో వేరుశనగ తో పాటు 310 హెక్టార్లలో పొగాకు 3182 హెక్టార్లలో మినుము పంట నీటి పాలయ్యాయి. చేతికి అంది వచ్చిన పంట నీట మునగడంతో అన్నదాత కన్నీరు పెట్టాడు. ముంపు పరివాహక ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పెన్నా పరివాహక ప్రాంతాలోని మూడువేల మందిని ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.   ముంపు వాసులకు భోజనం, మంచినీరు, పాలు అందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. అంతేకాదు పెన్నా నది వరద ఉధృతి తగ్గేవరకూ వరద బాధితులను పునరావాస కేంద్రాల్లో నే ఉంచుతామని కమిషనర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. ముంపువాసులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

Also Read:

వరద ముంపు ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే.. తాజా పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా

వర్షాలు, వరదలతో కడప జిల్లా అతలాకుతలం.. 30మంది గల్లంతు.. 12 మృతదేహాలు లభ్యం.. నేడు కొనసాగనున్న గాలింపు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!