Chinese Man: నీకు తిండి పెట్టలేం బాబు.. అతడిని రెస్టారెంట్‌కు రావొద్దని వేడుకుంటున్న యాజమాన్యం..

Chinese Man: రెగ్యులర్ గా తినే ఆహారానికి భిన్నంగా ఉండాలని కొందరు.. పనిమీద బయటకు వెళ్ళినప్పుడు మరికొందరు తమకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి రెస్టారెంట్..

Chinese Man: నీకు తిండి పెట్టలేం బాబు.. అతడిని రెస్టారెంట్‌కు రావొద్దని వేడుకుంటున్న యాజమాన్యం..
China Man
Follow us

|

Updated on: Nov 20, 2021 | 9:26 AM

Chinese Man: రెగ్యులర్ గా తినే ఆహారానికి భిన్నంగా ఉండాలని కొందరు.. పనిమీద బయటకు వెళ్ళినప్పుడు మరికొందరు తమకు ఇష్టమైన ఆహారాన్ని తినడానికి రెస్టారెంట్ కు, లేదా ఫుడ్ స్టాల్స్ లోకి వెళ్తారు. అక్కడ తమకు కావాల్సిన పదార్ధాలను తమకు నచ్చిన మెచ్చిన ఫుడ్ ని ఆర్డర్ ఇచ్చి తింటారు. ఫుల్‌ మీల్స్‌ అంటే తెలుసుకదా.. తినగలిగినంత సప్లయ్‌ చేయాలి. రేటు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుందనుకోండి.. బాగా ఆకలిగా ఉన్న ఓ వ్యక్తి రెస్టారెంట్‌కి వెళ్లి ఫుల్‌ మీల్స్ ఆర్డర్‌ చేశాడు. తీరా అతను భోజనం చేశాక రెస్టారెంట్‌ నిర్వాహకులు అతనికి దండం పెట్టి.. మళ్లీ మా రెస్టారెంట్‌కి రావద్దని చెప్పేశారు.. ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

చైనాకి చెందిన కాంగ్‌ అనే వ్యక్తి ఛాంగ్‌షా నగరంలోని BBQ బఫే రెస్టారెంట్‌ కి వెళ్లాడు. అక్కడ ఫుల్‌ మీల్స్‌ ఆర్డర్‌ చేశాడు. ఎంత ఫుల్‌ మీల్స్‌ అయినా మహా అంటే ఒక కేజీ, లేదంటే రెండు కేజీల ఫుడ్‌ తింటారు. కానీ ఈ వ్యక్తి ఏకంగా 5 కేజీల భోజనం లాగించేశాడు. అలా రెండు సార్లు ఆ రెస్టారెంట్‌కి వెళ్లిన అతను రెండుసార్లూ 5 కేజీల కంటే ఎక్కువే భోజనం చేశాడు. దాంతో ఎంత బఫే అయితే మాత్రం… ఇంతలా తింటే ఎలా… ఇలాగైతే మా రెస్టారెంట్ మూసుకోవాల్సిందే అంటూ “నాయనా నీకో దండం… నువ్వు మాత్రం మా రెస్టారెంట్‌కి రావొద్దు” అని అతన్ని పంపించేశారు. ఈ విషయం స్వయంగా లైవ్ స్ట్రీమ్‌లో తెలిపాడు కాంగ్. ఆ రెస్టారెంట్ తనపై వివక్ష చూపిందనీ… ఎక్కువ తినడం తన తప్పు ఎలా అవుతుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

అయితే ఆ మనిషి తమ రెస్టారెంట్ కి ఇక తినడానికి రావద్దు అని చెప్పడంలో ఆ రెస్టారెంట్ యజమాని తప్పేమీ లేదనే చెప్పాలి… ఎందుకంటే అతను ఏకంగా 20 నుంచి 30 బాటిళ్లు సోయా పాలు తాగుతాడట. అంతేకాదు పోర్క్ ట్రొట్టర్స్ మొత్తం ట్రే ఖాళీ చేసేస్తాడట. ఇక రొయ్యల విషయానికి వస్తే… సాధారణంగా కస్టమర్లు… ఒకటీ రెండూ రొయ్యలు తీసుకోవడానికి టాంగ్స్ ఉపయోగిస్తే… అతనేమో… ఏకంగా ట్రే వాడుతాడట. ఇతను వచ్చిన ప్రతిసారి తాను చాలా లాస్‌ అవుతున్నానని రెస్టారెంట్‌ ఓనర్‌ నెత్తి బాదుకుంటున్నాడు. ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Also Read:   బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణనిచ్చే పంపర పనస.. ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు అత్యంత మేలు..