Pomelo Fruit: బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణనిచ్చే పంపర పనస.. ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు అత్యంత మేలు..

ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరం మొక్కలు. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ సీజన్ లో దొరికే పంపర పనస పండులో

Pomelo Fruit: బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణనిచ్చే పంపర పనస.. ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు అత్యంత మేలు..
Pampara Panasa
Follow us

|

Updated on: Nov 20, 2021 | 9:02 AM

Pomelo Fruit ప్రకృతి మనిషికి ప్రసాదించిన వరం మొక్కలు. ఆయా సీజనల్ లో లభ్యమయ్యే పండ్లను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ఈ సీజన్ లో దొరికే పంపర పనస పండులో కూడా మంచి ఔషధ గుణాలున్నాయి. నిమ్మజాతి చెందిన ఈ పంపర పనసలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు దివ్య ఔషధమని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. చైనా ప్లోరిడా, వంటి మధ్యస్థ పంపర పనస ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పండుతుంది. పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉండే ఈ పండు రెండు రంగుల్లో ఉంటుంది. దానిమ్మ గింజల రంగు తొనలు లేదా తెల్లని తొనలు ఉంటాయి. ఈ పంపర పండు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఈరోజు తెలుసుకుందాం..

*పంపర పనసలో ఔషదాలు మెండు. జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయటానికి ఎంతో తోడ్పడుతుంది.

*ఈ పండులో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన నిరోధకాలు ఉన్నాయి.

*బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు అత్యంత మేలు చేస్తోంది.

*లావు తగ్గటానికి, లివర్ సమస్యలు నివారిస్తాయి.

*రక్త ప్రసరణ అభివృద్ధి  పరుస్తుంది.

*గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది.

*ముఖ్యంగా ఈ పండు చర్మాన్ని ఆరోగ్య వంతంగా ఉంచుతుంది. చర్మం రంగు మారకుండా చేస్తుంది. వృద్ధాప్యపు లక్షణాలను దూరం చేస్తుంది.

పులులు-వగరు తీపిల కలయికను ఇష్టపడేవారు ఈ సీజన్ లో దొరికే పంపర పనస పండుని నిర్లక్ష్యం చేయకుండా తినండి.. ముఖ్యంగా 30 దాటిన స్త్రీలకు ఎముకలకు శక్తినిస్తుంది. అయితే దీనిని గోదావరి ప్రాంత వాసులు పండులాగానే కాదు.. సలాడ్‌గా కూడా చేసుకుని తింటారు.

Also Read:   కడప జిల్లాలో భారీ వర్షాలు.. జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు. మరికొన్ని దారిమల్లింపు.. వివరాల్లోకి వెళ్తే..  ఈరోజు ఈ రాశివారు జీవితభాగస్వామి నిర్ణయాలతో లాభపడతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

l

Latest Articles