‘చంద్రబాబు మాయలో పడొద్దు.. ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే..’ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..

'చంద్రబాబు మాయలో పడొద్దు.. ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే..' లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..
Lakshmi Parvathi

నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు ఎపిసోడ్‌పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే.. అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు..

Ravi Kiran

|

Nov 20, 2021 | 6:45 PM

నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన చంద్రబాబు ఎపిసోడ్‌పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఇష్యూలో చేసినట్లుగానే.. అసెంబ్లీ అంశంలోనూ చంద్రబాబు అబద్దాలు చెప్పారన్నారు. అక్కడ ఏమి జరగకపోయినా.. మసిపూసి మారేడుకాయ చేశారని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి విమర్శనాస్త్రాలు గుప్పించారు. తాను వైసీపీ నాయకురాలిగా మీడియా ముందుకు రాలేదని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలిగా మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు చెప్పని ఓ నిజాన్ని చెబుతున్నా.. ‘ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చంద్రబాబు నాకు ఫోన్ చేసి.. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని ఫారిన్ వెళ్లిపో’ అని అన్నారు. ఇది నిజమో కాదో బాలయ్య.. చంద్రబాబును అడగాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీ చంద్రబాబు మాయలో మరోసారి పడొద్దని కోరుతున్నా.. మిమ్మల్ని అబద్దాల వలయంలో చుట్టేశారు. లోకేష్‌ను సీఎం చేయాలన్నదే చంద్రబాబు టార్గెట్‌‌ని లక్ష్మీ పార్వతి చెప్పారు.

‘మీ నాన్నగారికి జరిగిన అన్యాయంపై మీకు బాధలేదా.?’.. ‘చెప్పులు వేయించిన ఘటన మర్చిపోయారా.?’ భువనేశ్వరిని అంటే తనకు బాధ కలుగుతుందని.. కానీ వైసీపీ నాయకులు అనలేదని చెప్పినా ఎందుకు పట్టించుకోరని లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి పనులు చేసినా చంద్రబాబు కోర్టులకు వెళ్లి మరీ అపుతున్నాడని లక్ష్మీ పార్వతి విమర్శించారు. వైఎస్ కుటుంబం చాలా మంచి కుటుంబం.. చంద్రబాబు లాంటి దుర్మార్గుడి మాటలను మీరు ఎలా నమ్ముతారు బాలయ్య బాబు.? అని లక్ష్మీ పార్వతి తెలిపారు. నిజంగా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అలాంటి వ్యాఖ్యలు చేస్తే.. తక్షణమే చర్యలు తీసుకోవాలని నేనే సీఎం జగన్‌కు లేఖ రాస్తానని లక్ష్మీ పార్వతి అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu