Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..

Jr NTR: మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం.. రాజకీయాల్లో విమర్శలు,

Jr NTR: వ్యక్తిగత దూషణలు సరికాదు.. అసెంబ్లీ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం..
Jr Ntr
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2021 | 6:43 PM

Jr NTR: మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ.. దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఘటన దారుణం అని పేర్కొన్నారు. ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన సంప్రదాయం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడటం లేదని, ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా ముఖ్యంగా తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు.

ఈ అరాచక సంస్కృతిని ఆపి, ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడాలన్నారు. ఇది ఇంతటితో ఆగిపోవాలని.. జూ. ఎన్టీఆర్ విన్నవించారు. కాగా.. అంతకుముందు టీడీపీ నేత, నటుడు నందమూరి బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ స్పందించారు. తమ కుటుంబం జోలికి వస్తే సహించేది లేదంటూ బాలకృష్ణ హెచ్చరించారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన వీడియోను ఇక్కడ చూడండి..