AP Rain Alert: మరో మూడు రోజులు దంచికొట్టుడే.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్..
AP Weather Updates: వాయుగుండం ప్రభావంతో ఏపీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా

AP Weather Updates: వాయుగుండం ప్రభావంతో ఏపీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం శుక్రవారం తీరం దాడించింది. అనతరం మళ్లీ తీవ్ర అల్పపీడనంగా మారి ఈరోజు దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలైన ఉత్తర తమిళనాడు, రాయలసీమ మీద పయనిస్తూ బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల మీద కొనసాగుతున్నది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఉత్తర తమిళనాడు, రాయలసీమ కోస్తాంధ్ర మీదగా దక్షిణ ఒడిస్సా వరకు 1 .5 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగి బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈమేరకు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల వాతావరణ పరిస్థితులను ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అమరావతి వాతవరణ కేంద్ర సంచాలకులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Also Read: