Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. పడవ అంతపెద్ద చేప !! పంటపండిరోయ్‌ !! వీడియో

బాబోయ్.. పడవ అంతపెద్ద చేప !! పంటపండిరోయ్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Nov 20, 2021 | 9:35 PM

భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలు నష్టపోగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మత్స్యకారుల పంట పండుతోంది.

భారీగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలు నష్టపోగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మత్స్యకారుల పంట పండుతోంది. వరద ఉధృతికి కొన్ని చోట్ల చేపలు భారీగా కొట్టుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే కడప జిల్లాలో అతిపెద్ద చేప చెరువులో దర్శనమిచ్చింది. నందలూరు పరిధి చెయ్యేరు నదిలో సుమారు 100కేజీల పైనే బరువున్న చేప తారసపడింది. ఆ చేపను చూస్తే అది పడవ అంత సైజ్‌ను దాటి కనిపించింది. దాన్ని పడవలో వేసినా పట్టదేమో అనేంతంగా ఉంది. నందలూరు సాయిబాబా గుడి దగ్గర చెయ్యేరు నదిలో కనిపించిన ఈ చేప.. అరుదైన చేప అనక తప్పదు. నీటిలో తోకను అలా ఆడిస్తూ ఈదుతుంటే నదిలో అద్భుత దృశ్యం ఆవిషృతమైనట్లే ఉంది. అది గమనించిన ఓ యువకుడు భారీ చేపను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో ఇప్పుడా బిగ్‌ఫిష్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Kerala: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా.. సర్కార్‌ కీలక సర్క్యూలర్‌ !! వీడియో

జాబిల్లిపై బిందాస్‌ జిందగీ !!1,00,000 ఏండ్లకు సరిపడా ఆక్సిజన్‌ !! వీడియో

Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో

కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో