కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరైపోయింది. అయితే కొంతమంది మాస్క్ ధరించడంలోనూ సృజనాత్మకత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేసిన మాస్కుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి…ఇక తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ఆభరణాల వ్యాపారి బంగారంతో మాస్క్ రూపొందించాడు. దక్షిణాన 24 పరగణాల జిల్లా బడ్జ్ పట్టణానికి చెందిన చందన్ దాస్ 5లక్షల 70వేల రూపాయల ఖర్చుతో ఈ గోల్డెన్ మాస్క్‌ను తయారుచేశాడు. సుమారు 108 గ్రాముల బరువున్న ఈ మాస్క్‌ను తయారుచేయడానికి అతనికి15 రోజులు పట్టిందట. బంగారు ఆభరణాలు ధరించడమంటే ప్రత్యేక ఆసక్తి చూపే చందన్ పండగలు, పర్వదినాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ మాస్క్‌ను ధరిస్తాడట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kerala: మహిళా టీచర్లు చీరలే కట్టుకోవాలా.. సర్కార్ కీలక సర్క్యూలర్ !! వీడియో
జాబిల్లిపై బిందాస్ జిందగీ !!1,00,000 ఏండ్లకు సరిపడా ఆక్సిజన్ !! వీడియో
Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష.. వీడియో
Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు.. వీడియో